Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజు నయన ప్రియమైన ముద్దు

By:  Tupaki Desk   |   15 Feb 2019 11:06 AM GMT
ప్రేమికుల రోజు నయన ప్రియమైన ముద్దు
X
ప్రేమ పక్షుల్లా లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవడం ఒక్కటే బాలన్స్. ఇప్పటిదాకా బయటికి అధికారికంగా చెప్పకపోయినా ఫోటోలు చేష్టల ద్వారా తమ బంధాన్ని ప్రపంచానికి ఎప్పుడో చాటి చెప్పిన ఈ లవర్స్ మూడు మూళ్ళకు మాత్రం ఇంకా చాలా టైం ఉందని అంటున్నారు. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జంట మాములు రచ్చ చేయలేదు. అందులో కొన్ని జ్ఞాపకాలను విగ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు.

అందులో బాగా వైరల్ అవుతున్న పిక్ పైన మీరు చూస్తున్నది. విగ్నేష్ శివన్ ముక్కు మీద తన ఆధారాలతో బంధనం వేస్తున్న నయన్ ని చూస్తూ షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. విగ్నేష్ ది ఎంతటి అదృష్టమో అని ఈర్ష్య పడుతూనే అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారా అంటే అనుమానమే అంటోంది తమిళ్ మీడియా. నయనతార పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటుతున్నా డిమాండ్ లో మాత్రం ఏ మార్పు లేదు.

తెలుగు సైరాలో చిరంజీవితో నటిస్తూనే మరోపక్క తమిళ్ లో విజయ్ లాంటి స్టార్ల సరసన ఆఫర్స్ వరసబెట్టి కొట్టేస్తోంది. పెళ్లి ప్రస్తావన మరో రెండు మూడేళ్ళ తర్వాత చూడమని చెబుతున్నట్టు సన్నిహితుల సమాచారం, వెంకటేష్ చైతుల వెంకీ మామ కోసం నయనతార కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. గతంలో లక్ష్మి-తులసి లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించిన హిట్ కాంబినేషన్ కాబట్టి సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. అయితే నయన్ దగ్గర డేట్స్ ఖాళీగా లేవు. సైరాకే ఎక్స్ ట్రా డేట్స్ అవసరం పడితే అవి ఇవ్వడానికే నానా తంటాలు పడిందట. ఇక కొత్త సినిమాల గురించి వేరే చెప్పాలా