Begin typing your search above and press return to search.
ఏడేళ్ల ప్రయాణం అన్నీ అందించిందట!
By: Tupaki Desk | 22 Oct 2022 3:01 PM GMTకోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ కొన్నేళ్ల ప్రేమాయణం తరువాత జూన్ 9న ఇరు కుటుంబాల అంగీకారంతో చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో వున్న రిసార్ట్స్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అంతా వీరి వివాహానికి హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ప్రత్యేక వీడియోని డాక్యుమెంటరీగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించురున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ దంపతులు ఇటీవల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రలైనట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. తమ కవల పిల్లల పాదాలని ముద్దాడుతున్న ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లై నెలలు మాత్రమే అవుతున్న నేపథ్యంలో బేబీ బంప్ తో నయన్ కనిపించలేదు...అప్పుడే పిల్లలు పుట్టడం ఏంటీ? అని అంతా అవాక్కయ్యారు.
కొంత మంది నెటిజన్స్ నయన దంపతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. సుప్రీం కోర్టు నిషేధించిన సరోగసీ విధానంని ఈ దంపతులు ఎలా అతిక్రమించారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో నయన దంపతుల చుట్టూ వివాదం మొదలై ప్రభుత్వం విచారణ కూడా మొదలు పెట్టింది. నవ దంపతుల చుట్టూ వివాదం అలుముకుంటున్న వేళ నయన్ దంపతులు తన ఏడేళ్లు ప్రేమ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
విఘ్నేష్ శివన్ రూపొందించిన మూవీ `నానుమ్ రౌడీదాన్`. 2015లో వచ్చిన ఈ మూవీ తో నయనతారతో విఘ్నేష్ శివన్ ల ప్రేమ ప్రయాణం మొదలైంది. షూటింగ్ ఆన్ లొకేషన్ లో విఘ్నేష్ పట్ల నయనకు ప్రేమ చిగురించింది. అది మరింత బలపడటంతో ఇద్దరు కలిసి కొన్నేళ్లుగా డేటింగ్ లో వుంటూ వచ్చారు. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చించుకునేలా ప్రతీ ఈవెంట్, అవార్డ్ ఫంక్షన్స్ లో జంటగా మెరిసారు. ఓ అవార్డ్ ఫంక్షన్ లో నయన్ ఏకంగా విఘ్నేష్ చేతుల మీదుగా అవార్డుని అందుకోవడంతో ఇద్దరి మధ్య వున్న ప్రేమపై వస్తున్న రూమర్ లకు క్లారిటీ వచ్చేసింది.
అప్పటి వీరి ప్రేమాయణం నిరాటంకంగా సంవత్సరాలుగా సాగుతూనే వుంది. ఈ ఏడాది ఇరు కుటుంబాల అంగీకరంతో పెళ్లి చేసుకున్నారు. సరోగసీ వివాదం తలెత్తడంతో నయన్, విఘ్నేష్ ల వివాహం ఆరేళ్ల క్రితమే జరిగిందంటూ వార్తలు మొదలయ్యాయి. ఇదిలా వుంటే వీరి ప్రేమకు కారణమైన `నానుమ్ రౌడీదాన్` మూవీ విడుదలై ఏడేళ్లు కావస్తున్న నేపథ్యంలో విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేయడం విశేషం. ఏడేళ్ల మధురమైన అనుభవం. ఈ సినిమా నాకు అన్నీ అందించింది` అంటూ పోస్ట్ చేస్తూ సెట్ లో నయనతో వున్న వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.