Begin typing your search above and press return to search.

ఆసక్తి పెంచుతున్న నయన్ - నిత్యలు

By:  Tupaki Desk   |   10 Oct 2018 6:05 AM GMT
ఆసక్తి పెంచుతున్న నయన్ - నిత్యలు
X
తమిళం లో నయనతార జోరు మామూలుగా లేదు. వరసబెట్టి సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న నయన్ తాజాగా మరో ఆసక్తి రేపే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పేరు 'ఐరా'. కెఎమ్ సర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నయన్ ఫేస్ మాత్రమే ఉంది. ఏదో చూస్తున్నట్టుగా ఉంది.. ఇక ఆమె ఫేస్ కు వెనకాల ఫుల్ బ్లాక్ షేడ్ లో మరో నయన్ ఫేస్ ఉంది. ఏదో వేదనకు గురయిన స్త్రీలా కనిపించింది. సినిమా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఫస్ట్ లుక్ తోనే ఏదో మిస్టరీ ఉంది అనే ఫీల్ కలిగించడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

మరోవైపు నిత్య మీనన్ కూడా తన తాజా చిత్రం 'ప్రాణ' ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకులను పలకరించింది. VK ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పెషాలిటీ మీకు తెలిస్తే షాక్ అవుతారు. ఈ సినిమాలో నిత్య తప్ప వేరే నటులు లేరు. ఇక పోస్టర్ లో నిత్య మీనన్ బ్యాక్ గ్రౌండ్ లో రెండు పాదాలు మాత్రమే ఉన్నాయి.. మార్చురీ లో బొటనవేలుకు ట్యాగ్ తగిలిస్తారు కదా అలా ఒక ట్యాగ్ ఉంది. ఈ పోస్టర్ కూడా ఆసక్తి రేకెత్తించేదిగా ఉంది.

ఒకే సారి ఇద్దరు బ్యూటీలు ఇలా ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో ప్రేక్షకులను పలకరించడం విశేషమే. రెండు పోస్టర్లకు సోషల్ మీడియా లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.