Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కేరళ చీరకట్టులో భామలు భలే
By: Tupaki Desk | 14 Sep 2016 10:06 AM GMTకేరళ వారికి ఓనమ్ పండుగ అనేది చాలా ముఖ్యమైన పర్వదినం. అక్కడ కులమతాలకు అతీతంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. రాజు మహాబలి (తెలుగులో బలి చక్రవర్తి) అక్కడి నేలను చూడ్డానికి ప్రతీ సంవత్సరం ఈ రోజున ఒక్కసారి స్వర్గం నుండి విచ్చేస్తాడని పురాణం చెబుతుంది. అందుకే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
ఇక ఓనమ్ లో ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. బంగారు అంచుతో ఉండే తెల్లటి చీరను ధరించి.. అక్కడ తిరువతిరకళి అనే నాట్యం చేస్తుంటారు. సినిమాల్లో కూడా చాలాసార్లు ఈ నృత్యాలను మనం చూస్తూనే ఉంటాం. డ్యాన్స్ సంగతేమో కాని ట్రెడిషనల్ కేరళ చీరలను కట్టుకుని.. సాంప్రదాయబద్దంగా రెడీ అయిన మన మలయాళ కుట్టీలు.. తమ చీరకట్టుతో చంపేస్తున్నారంతే. ఈ రోజు ఉదయం నయనతార ఎలా రెడీ అయ్యిందో చూడండి. అమ్మడు కేరళలతో తన పేరెంట్స్ తో కలసి సెలబ్రేట్ చేసుకుంటోందట. ఇక మరో హీరోయిన్ పూర్ణ (షామ్నా కాసిమ్) కూడా అంతే. ఆ ఫోటోలను చూస్తే మీకే అర్ధమవుతోందిగా.. చీరకట్టులో భామలు భలే అనకమానరు.
పుట్టుకతో క్రిస్టియన్ అయిన నయనతార.. అలాగే ముస్లిం అయిన పూర్ణ.. ఇలా 'ఓనమ్' పండుగను జరుపుకుంటూ.. భారతదేశపు సెక్యులర్ ఫ్యాబ్రిక్ తాలూకు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు కదూ. వెల్ డన్.