Begin typing your search above and press return to search.

నయన్‌ ప్రభుదేవా మళ్లీ చేతులు కలుపబోతున్నారా?

By:  Tupaki Desk   |   4 Jun 2020 7:50 AM GMT
నయన్‌ ప్రభుదేవా మళ్లీ చేతులు కలుపబోతున్నారా?
X
ఆశ్చర్యంగా ఉందా.. విఘ్నేష్‌ శివన్‌ తో పెళ్లికి రెడీ అయిన నయనతార మళ్లీ మాజీ ప్రియుడు అయిన ప్రభుదేవాతో చేతులు కలపడం ఏంటా అంటూ ఆలోచిస్తున్నారు కదా. అసలు విషయం ఏంటీ అంటే వీరిద్దరి కాంబోలో ఒక సినిమాకు తమిళ ప్రముఖ నిర్మాత ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌ గా కార్తి హీరోగా సినిమా రూపొందబోతున్నట్లుగా తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఈ కాంబో కనుక నిజంగానే వస్తే ఖచ్చితంగా సినిమా సెన్షేషన్‌ అవ్వడం ఖాయం.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా నయనతార ప్రేమించుకున్నారు. అప్పటికే పెళ్లి అయినా కూడా ప్రభుదేవా ఈమెను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఎన్నో వివాదాలు మరెన్నో గొడవల మద్య వీరి పెళ్లి పీఠల వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత నయన్‌ కొన్నాళ్ల తర్వాత విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో పడినది. ఇద్దరు కూడా ప్రస్తుతం పెళ్లికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రభుదేవాతో మూవీ అవసరమా అంటూ చాలా మంది అనవచ్చు. కాని నయనతారకు కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్‌ ఇంకా కార్తీ హీరోలుగా సినిమాను నిర్మించేందుకు ఐసరాయ్‌ గణేశ్‌ అనే నిర్మాత ప్లాన్‌ చేశారు. చర్చలు పూర్తి అయ్యి షూటింగ్‌ కు వెళ్లాల్సిన సమయంలో సినిమా ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమా పట్టాలెక్కించేందుకు ప్రభుదేవా సిద్దం అయ్యాడు. అయితే ఇద్దరు హీరోలకు బదులుగా ఒక్క హీరోతోనే సినిమా చేయాలని భావిస్తున్నాడు.

విశాల్‌ ను అనుకున్న పాత్రకు గాను నయనతారను తీసుకుంటే బాగుంటుందని.. ఇదో లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా చాలా పవర్‌ ఫుల్‌ పాత్రలో నయన్‌ కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.