Begin typing your search above and press return to search.

మణిరత్నం స్కూల్లోకి కొత్త హీరోయిన్లు

By:  Tupaki Desk   |   18 July 2015 5:48 PM IST
మణిరత్నం స్కూల్లోకి కొత్త హీరోయిన్లు
X
కాస్టింగ్ విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటాడు మణిరత్నం. అందుకే తనకు ట్యూన్ అయ్యేవాళ్లతోనే మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు. కాస్టింగ్ మార్చాల్సి వచ్చినా.. అందుకు చాలా టైం తీసుకుంటాడు. ఒకపట్టాన ఎవరినీ ఓకే చేయడు. ఓకే బంగారం సినిమాకు హీరో హీరోయిన్లను సెట్ చేయడానికి ఆరు నెలలకు పైనే టైం పట్టింది మణిరత్నంకు. ఇప్పుడిక తన కొత్త సినిమాకు నటీనటుల్ని ఎంపిక చేయడానికి కూడా అలాగే టైం తీసుకున్నాడు. మూడు నెలల అతడి అన్వేషణకు ఎట్టకేలకు తెరపడింది. ముందుగా కార్తిని లీడ్ రోల్‌ కు తీసుకుని.. ఆ తర్వాత రెండో హీరో కోసం చాలా పేర్లు పరిశీలించి, చివరికి దుల్కర్ సల్మాన్‌ కే అవకాశమిచ్చిన మణి.. హీరోయిన్ల విషయంలో కూడా క్లారిటీకి వచ్చేశాడు.

ఇప్పటిదాకా మణిరత్నంతో పని చేయని ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రాజెక్టులోకి వస్తున్నారు. అందులో ఒకర నయనతార కాగా.. మరొకరు శ్రుతి హాసన్. వీళ్లిద్దిరికీ ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్న నయనతార ఇది తనకు బిగ్గెస్ట్ ఛాన్స్ అంటోంది. మరోవైపు కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ రోల్సే చేస్తున్న శ్రుతి.. తొలిసారి తనలోని నటికి పరీక్ష పెట్టుకోబోతోందన్నమాటే. శ్రుతి తండ్రి కమల్ మణిరత్నంతో ‘నాయగన్’ లాంటి క్లాసిక్ చేశాడు. కానీ ఆ తర్వాత ఇద్దరికీ ఇగో క్లాషెస్ వచ్చి సినిమా చేయలేకపోయారు. ఇంతకుముందు నాగార్జున, మహేష్ బాబు, ఐశ్వర్యారాయ్ లతో చేయాలనుకున్న ప్రాజెక్టునే ఇప్పుడు కాస్టింగ్ మొత్తం మార్చి తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘కోమలి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.