Begin typing your search above and press return to search.
డైరెక్టర్ తో రోమ్ లో రొమాన్స్??
By: Tupaki Desk | 21 Nov 2015 5:27 AM GMTఆ ఇద్దరికి ఆన్ సెట్స్ స్నేహం కుదిరింది. అటుపై అది ప్రేమకు దారి తీసింది. లవ్వాయణం పీక్స్ కి చేరుకుంది. వన్ ఫైన్ డే ఎవరికీ చెప్పకుండా పెళ్లాడేసుకున్నారన్న ప్రచారం కూడా సాగింది. అసలింతకీ ఎవరీ జంట? అవును మీ అభిమాన తార నయనతార తాలూకా నిజ జీవిత సినిమా ఇది. శ్రీరామరాజ్యం చిత్రంలో తెలుగింటి సీతమ్మగా అలరించిన నయనతార వ్యక్తిగత జీవితం కాస్త ఒడిదుడుకుల్లోనే సాగిన సంగతి తెలిసిందే.
ఏదైతేనేం ఈ అమ్మడు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉందన్న వార్తలు కోలీవుడ్ ని పెనుతాఫాన్ లా చుట్టేశాయి. అప్పట్లో ఈ ఇద్దరూ కలిసి నానుమ్ రౌడీ ధాన్ అనే చిత్రానికి పనిచేశారు. ఆ మూవీ తమిళనాట రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందుకే ఈ ఏడాది ఎంతో కలిసొచ్చిన సంవత్సరం ఈ ఇద్దరికీ. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కాబట్టి సెలబ్రేషన్స్ కూడా ఓ రేంజులో జరుపుకోవాలని ప్లాన్ చేశారు ఈ జంట. పనిలో పనిగా ఈనెల 31న నయనతార పుట్టినరోజు. ఆరోజు స్వదేశంలో సెలబ్రేషన్ అయితే మజా ఏం ఉంటుంది? అందుకే ఈ జంట ఇప్పటికే రోమ్ వెళ్లిపోయారు. అక్కడినుంచి ఈ ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పటి ఫోటో ఒకటి ఒక ప్రముఖ మీడియా జర్నలిస్టు దగ్గరకు వచ్చి పడింది. అంతే ఈ జోడీ రొమాన్సే రొమాన్స్ అంటూ ప్రస్తుతం కోలీవుడ్ - టాలీవుడ్ లో ప్రచారమవుతోంది.
రాత్రుళ్లు ఏకాంత వేళ క్యాండిల్ లైట్ డిన్నర్ లతో అదరగొట్టేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ చిద్విలాసం ఇక్కడితో ఆగిపోలేదు. రోమ్ నుంచి వెనిస్ వెళతారు. అక్కడి నుంచి నేపాల్ కి తిరిగొస్తారు. మిలాన్ లోనూ కొంత టైమ్ స్పెండ్ చేస్తారు. లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేయడమే పాలసీ. నెలాఖరు వరకూ ఇదే తతంగం. ఏదేమైనా నయన్ జీవితంలో మరిచిపోలేని పుట్టినరోజు ఇది. ఇలాంటి అదృష్టం వేరొకరికి దక్కుతుందంటారా?