Begin typing your search above and press return to search.

ఆ సినిమా హిట్టయితే నయన్ పెళ్లే..

By:  Tupaki Desk   |   30 Sep 2015 9:30 AM GMT
ఆ సినిమా హిట్టయితే నయన్ పెళ్లే..
X
అంతా అనుకున్నట్లు జరిగితే ఈపాటికి నయనతార పెళ్లయిపోయి పిల్లల్ని కూడా కనేదేమో. కానీ ప్రభుదేవాతో అనుకోకుండా బ్రేకప్ అయిపోవడంతో ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది నయన్. ఐతే ఇప్పుడు అవకాశాలకు లోటేం లేదు కానీ.. 30 ప్లస్ లో పడిపోయింది కాబట్టి ఇంకా ఎన్నో ఏళ్లు కెరీర్ కొనసాగించడం కష్టం. కాబట్టి మంచి తోడు చూసుకుంటే బెటర్. నయన్ ఆ ప్రయత్నంలోనే ఉందని అంటున్నారు. తమిళ డైరెక్టర్ విఘ్నేష్‌ తో ఆమె సాగిస్తున్న ప్రేమాయణం పెళ్లికి దారితీసే అవకాశాలున్నట్లు కోలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఐతే నయన్ రేంజికి విఘ్నేష్ సూటవుతాడా అన్న డౌట్లు లేకపోలేదు. నయన్ తో ప్రేమాయణం మొదలవడానికి దారి తీసిన ‘నాను రౌడీదా’ అతడికి రెండో సినిమానే. ఇంతకుముందు శింబుతో ‘పోడా పోడీ’ అనే సినిమా చేశాడు. అది ఓ మోస్తరుగా హిట్టయిందది. ‘నానుమ్ రౌడీదా’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే సినిమా చాలా ఆలస్యం కావడం వల్ల కొంచెం నెగెటివ్ టాక్ కూడా ఉంది. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా హిట్టయితే విఘ్నేష్ కెరీర్‌ కు ఢోకా ఉండదు కాబట్టి అతణ్ని పెళ్లి చేసుకోవడానికి నయన్ కు అభ్యంతరాలు ఉండవు. వచ్చే ఏడాదిలో పెళ్లి ఖాయం అంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం విఘ్నేష్ కెరీర్ కు ఇబ్బందే. ఆ పరిస్థితుల్లో నయన్ అతడికి టాటా చెప్పేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ‘నానుమ్ రౌడీదా’ విఘ్నేష్ ఫేట్ ను ఎలా డిసైడ్ చేస్తుందో చూడాలి.