Begin typing your search above and press return to search.

నయన్ ఈసారైనా పెళ్లి పీటల దాకా వచ్చేనా...?

By:  Tupaki Desk   |   7 Jun 2020 12:16 PM GMT
నయన్ ఈసారైనా పెళ్లి పీటల దాకా వచ్చేనా...?
X
సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్ హీరోయిన్‌ గా వెలుగొందుతోంది నయనతార. ఆమె సినీ కెరీర్ పక్కన పెడితే ప్రేమాయ‌ణాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికి రెండు సార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న్ ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ప్రేమ‌లో ఉంది. కెరీర్ ఆరంభం లోనే హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించి బ్రేకప్ చెప్పిన నయన్.. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. నయన్- ప్రభుదేవా పెళ్లి జరగబోతుందని అందరూ అనుకుంటుండగానే ఆ బంధం కూడా బ్రేకప్ అయింది. ఇక ముచ్చటగా మూడోసారి తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ తో ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ కూడా విడిపోయారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే విఘ్నేష్ శివన్‌ ఈ మధ్య చేసిన ట్వీట్ తో వీరిద్దరూ ఇంకా రిలేషన్ లో ఉన్నారని స్పష్టం అయింది. అయితే నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట.

గత కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు నయన్ - విఘ్నేష్ శివన్‌ పెళ్లి చేసుకున్నారంటూ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ పుకార్లే అని నయనతార క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా ఈ నెల 8వ తేదీ త‌ర్వాత ఆల‌యాలు తెరుచుకోనున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని ఓ ప్ర‌ముఖ ఆల‌యంలో నయన్ - విఘ్నేష్ జంట పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకోనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా కేవలం కొంతమంది అతిథులు మరియు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు న్యూస్ వస్తోంది. నాలుగేళ్లుగా తమ మధ్య ఉన్న బంధం గురించి వీరు సోషల్‌ మీడియా వేదికగా చాలాసార్లు పంచుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ వివాహబంధంతో ఒకటి కాబోతున్నారట. అయితే వివాహ వార్తలపై ఈ జంట నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో నయన్ ఇంట పెళ్లి బాజాలు అనే న్యూస్ మాత్రం ఊపేస్తోంది. మరి ఈసారైనా పెళ్లి పీటలెక్కి.. నయన్ లవ్ ఎఫైర్ నడుపుతుంది కానీ పెళ్లి మాత్రం చేసుకోదు అనే వార్తలకు ఫుల్‌ స్టాప్ పెడుతుందేమో చూడాలి.