Begin typing your search above and press return to search.
ఫొటోస్టోరీ : ప్రియుడితో నయన్ మరో టూర్
By: Tupaki Desk | 17 Sep 2018 4:03 AM GMTటాలీవుడ్ - కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గత కొంత కాలంగా నటుడు - దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారంపై అధికారికంగా క్లారిటీ రాకపోయినప్పటికి వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గత కొంత కాలంగా వీరిద్దరు చాలా క్లోజ్ గా ఉండటంతో పాటు - సమయం చిక్కినప్పుడల్లా టూర్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు అమెరికాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. అప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు.
అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను వీరిద్దరు సాంప్రదాయ బద్దంగా సందర్శించడం జరిగింది. ఈ జంట గోల్డెన్ టెంపుల్ టూర్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. నయనతార ఇప్పటి వరకు విఘ్నేష్ శివన్ తో తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది లేదు. కాని ఇలా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తమ మద్య ఉన్న ప్రేమను అందరికి తెలియజేస్తున్నారు.
గతంలో ప్రేమ విషయంలో రెండు సార్లు విఫలం అయిన నయనతార ఈసారి మాత్రం అలా కావద్దని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. త్వరగా వీరిద్దరు ఏకం కావాలని అంతా ఆశిస్తున్నారు. అయితే నయన్ ప్రస్తుతం హీరోయిన్ గా చాలా మంచి ఫామ్ లో ఉంది. ఆ కారణంగానే పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. పెళ్లి అయితే హీరోయిన్ కెరీర్ కు స్వస్థి చెప్పాల్సి రావచ్చు. అందుకే పెళ్లిని వాయిదా వేస్తూ ప్రేమను మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి 2020 వరకు అయ్యే అవకాశాలున్నాయంటూ తమిళ సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది.