Begin typing your search above and press return to search.

ఆంటీ పాత్రకు 4 కోట్లు డిమాండ్‌ చేసిన లేడీ సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   7 Aug 2020 9:10 AM GMT
ఆంటీ పాత్రకు 4 కోట్లు డిమాండ్‌ చేసిన లేడీ సూపర్‌ స్టార్‌
X
టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా క్రేజ్‌ ఉన్న నయనతార లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులతో పిలిపించుకుంటుంది. ఈమె కమర్షియల్‌ పాత్రలు మాత్రమే కాకుండా తన నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు ఓకే చెబుతోంది. ఇటీవలే ఈమె రజినీకాంత్‌ మూవీలో ఒక కీలక పాత్రను చేసేందుకు ఓకే చెప్పింది. ఆ సినిమాలో కీర్తి సురేష్‌ కు తల్లిగా కనిపించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ రాకుండానే మరో పుకారు ఇండస్ట్రీ వర్గాల్లో షికారు చేస్తోంది.

నితిన్‌ నటించబోతున్న హిందీ అంధాధున్‌ రీమేక్‌ లో నయన్‌ తార ఆంటీ పాత్రకు ఓకే చెప్పిందట. అయితే అందుకు గాను కాస్త ఎక్కువ పారితోషికంను కోట్‌ చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఒరిజినల్‌ వర్షన్‌ అంధాధున్‌ లో టబు పోషించిన పాత్రను తెలుగు రీమేక్‌ లో నయనతారతో చేయించేందుకు చర్చు జరిగాయి. పాత్ర ప్రాముఖ్యత దృష్ట్యా నటించేందుకు ఒప్పుకున్న నయనతార నాలుగు కోట్ల రూపాయలను డిమాండ్‌ చేసినట్లుగా చెబుతున్నారు.

భారీ పారితోషికం ఇచ్చి నయన్‌ ను ఈ చిత్రంలో నటింపజేస్తే సినిమాకు ఖచ్చితంగా మార్కెట్‌ పెరుగుతుంది. మరి నయన్‌ పారితోషికం విషయంలో మేకర్స్‌ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్‌ నితిన్‌ హోం బ్యానర్‌ లో నిర్మాణం జరుగబోతుంది. ఈ ఏడాది చివరి నుండి షూటింగ్‌ ను ప్రారంభించే అవకాశం ఉంది. అంతకు ముందు నితిన్‌ రంగ్‌ దే చిత్రంను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత అంధాధున్‌ రీమేక్‌ మొదలవ్వనుందట.