Begin typing your search above and press return to search.

ఆ దేవాలయంలో నయన్ పూజలు

By:  Tupaki Desk   |   30 Jan 2018 4:34 AM GMT
ఆ దేవాలయంలో నయన్ పూజలు
X
సౌతిండియాలో హీరోయిన్లలో స్టార్లు చాలామందే ఉన్నారు. కానీ ఈ జనరేషన్ లో లేడీ సూపర్ స్టార్ అనే స్టేటస్ దక్కింది ఒక్క నయనతారకు మాత్రమే. ఇటు కమర్షియల్ సినిమా అయినా.. అటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా అయినా నయనతార తన నటనతో అందరినీ మెప్పించేస్తుంది.

నయనతార సోషల్ మీడియాలో చాలా తక్కువగానే కనిపిస్తుంటుంది. అలాంటిది ఆమె లేటెస్ట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో ఉన్న సిక్కుల స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. బ్లాక్ కలర్ అనార్కలి డ్రస్ లో తలపై దుపట్టా కప్పుకుని అక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా పూజలు అవీ చేసింది. నయనతార జన్మత: ఆమె క్రిస్టియన్. పేరు డయానా కురియన్. నయనతారగా మారాక.. హిందూ మతం కూడా స్వీకరించింది. ఇప్పుడు అమృతసర్ వెళ్లి పూజలు చేశాక దిగిన ఫొటో తొలుత ట్విటర్ లో ప్రత్యక్షమైంది. నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తున్నారు.

నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటింది. సంవత్సరాలు పెరిగినా ఆమె పెరిగిందే తప్పలేదు. ఆమె పెట్టే కండిషన్స్ కు ఇష్టపడి మరీ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శక - నిర్మాతలు రెడీ అయిపోతున్నారంటే ఆమె ఇమేజ్ రేంజి తెలుస్తుంది. ఈ మళయాళ బ్యూటీ తాజాగా తెలుగులో బాలకృష్ణ పక్కన జైసింహా సినిమాలో నటించింది.