Begin typing your search above and press return to search.
రూల్స్ బ్రేక్ చేసి నయన్ మూవీ ప్రమోషన్స్ కి రానుందా..?
By: Tupaki Desk | 23 April 2020 12:10 PM GMTహీరోహీరోయిన్స్ ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే 'ఆ సినిమా షూటింగ్.. ప్రమోషన్స్.. ఇంటర్వ్యూస్.. థియేటర్ విజిట్స్ అన్నిట్లో భాగస్వాములవుతాం' అని అగ్రిమెంట్ చేసినట్లు అని చెప్తుంటారు. అయితే హీరోలు పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం షూటింగ్ కి సపోర్ట్ చేస్తే సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఈ పద్ధతిని మొదలెట్టింది స్టార్ హీరోయిన్ నయనతార అని చెప్పొచ్చు. తనకున్న పర్సనల్ కారణాల వల్ల సినిమా కాంట్రాక్ట్ సైన్ చేసే సమయంలోనే ఈ రూల్ ని యాడ్ చేసి మరీ అగ్రిమెంట్ చేసుకుంటుందట ఈ మలయాళ బ్యూటీ. ఇదేమిటని అడితే ''నేను కొన్ని విషయాలు నమ్ముతాను.. కొన్నింటిని ఫాలో అవుతాను.. ప్రమోషన్స్ కు రాకపోవడం నా సొంత నిర్ణయం.. నా దగ్గరకు స్క్రిప్ట్ తో వచ్చినపుడే ఈ విషయం చెబుతాను.. అలాగే ఓ వంద ఛానళ్ల ముందు కూర్చొని.. చెప్పిందే చెప్పి సినిమా చూడమనాల్సిన పని లేదు.. ప్రమోషన్స్ చేసినంత మాత్రాన ప్లాప్ సినిమా హిట్ అవ్వదు కదా.. డిజిటల్ యుగంలో ప్రమోషన్స్ లో చాలా కొత్త పద్ధతులు వస్తున్నాయి..' అంటూ సమాధానమిచ్చేదట. అందుకే ఈ బ్యూటీ చాలా ఏళ్లుగా మీడియా ముందుకు రావడం లేదు. ఇది మన ఒక్క టాలీవుడ్ కే కాదు అన్ని భాషల్లో నయన్ తీరు ఇలానే ఉంటుంది. మధ్యలో అప్పుడెప్పుడో బాలయ్య సరసన నటించిన 'శ్రీరామరాజ్యం' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నయన్ మళ్ళీ ఏ సినిమా ప్రచార కార్యక్రమంలో కనిపించలేదు. అయితే ఈ మధ్య ఒక సినిమాలో నటించడానికి తన రూల్స్ బ్రేక్ చేసిందట నయన్.
ఓ మళయాలీ ఆఫర్ రావడంతో.. సొంత గడ్డ కావడంతో నయన్ ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించిందట. పైగా పూర్తిగా నెగిటివ్ రోల్ అంట.. 'నరసింహ'లో రమ్యకృష్ణ టైప్ క్యారెక్టర్ అని సదరు సినిమా వారు నయన్ కి చెప్పడంలో ఈ బ్యూటీ కూడా ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉందట. అయితే వారు సినిమా రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ కి రావాల్సిందిగా నయన్ కోరడం జరిగిందట. అయితే దీనికి నయన్ టైమ్ తీసుకొని.. కొన్ని కండీషన్స్ తో మీడియాతో తాను ఇంట్రాక్ట్ అవ్వడానికి రెడీ అని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. ఇదే గనుక నిజమైతే మిగతా భాషల్లో కూడా నయన్ మీడియా ముందుకు రావాలి అని మిగతా సినీ ఇండస్ట్రీల వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో వ్యయప్రయాసలు పడి తీసిన సినిమా జనాల దాకా తీసుకుపోతేనే కదా.. వారి కష్టానికి రిజల్ట్ దొరికేది. మరి సొంత గడ్డలో సినిమా కోసం తన రూల్ బ్రేక్ చేసుకున్న నయన్ మిగతా భాషల విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.