Begin typing your search above and press return to search.

సొంత బ్యాన‌ర్ కాబ‌ట్టే న‌య‌న్ ఆ రూల్ బ్రేక్ చేసిందా?

By:  Tupaki Desk   |   20 Dec 2022 7:38 AM GMT
సొంత బ్యాన‌ర్ కాబ‌ట్టే న‌య‌న్ ఆ రూల్ బ్రేక్ చేసిందా?
X
తెలుగు, త‌మిళ భాష‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్ గా స్టార్ డ‌మ్ ని సొతం చేసుకున్న హీరోయిన్ న‌య‌న‌తార‌. గ‌త కొంత కాలంగా సినిమాల ప‌రంగా ఓ రూల్ ని పాటిస్తూ వ‌స్తోంది. ఏ సినిమా చేసినా.. ఎంత పెద్ద హీరో మూవీ అయినా స‌రే త‌ను ప్రమోష‌న్స్ కు హాజ‌రు కాలేన‌ని, ఆ అగ్రిమెంట్ ఓకే అనుకుంటే దాని ప్ర‌కారం సినిమా చేస్తాన‌ని కండీష‌న్ పెడుతూ గ‌త కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వ‌స్తోంది. అయితే తాజాగా ఆ రూల్ ని న‌య‌న‌తార బ్రేక్‌చేయ‌డం ప‌లువురిని షాక్ కు గురి చేస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. న‌య‌న‌తార న‌టించిన లేటెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'క‌నెక్ట్‌'. అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 22న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో ఈ మూవీని యువీ క్రియేష‌న్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో గ‌త కొన్నేళ్లుగా పెట్టుకున్న రూల్ ని న‌య‌న‌తార బ్రేక్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ని ఇటీవ‌లే ప్రారంభించారు.

ఈ ప్ర‌మోష‌న్స్ లో న‌య‌న‌తార జోష్ తో పాల్గొంటూ ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ షాకిస్తోంది. తెలుగులోనూ జోరుగా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు.

తెలుగు ప్ర‌మోష‌న్స్ కోసం యాంక‌ర్ సుమ‌తో క‌లిసి న‌య‌న‌తార ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఇందుకు సంబ‌ధించిన ఫొటోలు, ఓవీడియో నెట్టిట వైర‌ల్ గా మారింది. అంతే కాకుండా సోమ‌వారం చెన్నైలో జ‌రిగిన ప్రెస్ మీట్‌లో భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి న‌య‌న‌తార పాల్గొంది.

గ‌త కొన్నేళ్లుగా పాటిస్తూ వ‌స్తున్న రూల్ ని ఉన్న‌ట్టుండి 'క‌నెక్ట్' కోసం న‌య‌న‌తార ఎందుకు బ్రేక్ చేసిందా? అని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తెలిసింది. వివాహం త‌రువాత న‌య‌న‌తార లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగానే త‌ను ఈ రూల్ ని బ్రేక్ చేసింద‌ని, అంతే కాకుండా ఈ మూవీకి న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ నిర్మాత కావ‌డం వ‌ల్లే సొంత నిర్మాణ సంస్థ‌లో నిర్మించిన సినిమా కాబ‌ట్టి న‌య‌న‌తార త‌న రూల్ ని బ్రేక్ చేసి ప్ర‌మోష‌న్స్ లో పాల్తొంటోంద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.