Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క్రిస్మస్ రోజున ప్రియుడితో

By:  Tupaki Desk   |   26 Dec 2017 6:53 AM GMT
ఫోటో స్టోరి: క్రిస్మస్ రోజున ప్రియుడితో
X
సౌత్ లో గత కొన్నేళ్లుగా అవకాశాలను ఎలాగైతే దక్కించుకుంటుందో రూమర్స్ ని కూడా అదే తరహాలో తెచ్చుకుంటున్న బ్యూటీ నయనతార. అమ్మడి కెరీర్ గ్రాస్ సినిమా సినిమాకు చాలా వరకు పెరుగుతూనే వస్తుంది కానీ అస్సలు తగ్గడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ఇక లేటెస్ట్ హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా నయన అందం ముందు నిలవలేకపోతున్నారు.

దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మకు నటిగా మంచి గుర్తింపుని అందుకుంది. కానీ ఆమె బ్యాడ్ లాక్కో లేక ఆలోచన తీరో తెలియదు గాని మొత్తానికి వ్యక్తిగతంగా విమర్శలను ఎదుర్కోవడంలో చాలా మంది హీరోయిన్స్ ని మించిపోతోంది. అమ్మడు విగ్నేష్ అనే యువ దర్శకుడితో రిలేషన్ ని మెయింటేన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఆ రిలేషన్ కి అర్ధాన్ని మాత్రం అస్సలు చెప్పడం లేదు. కానీ ఎప్పటికపుడు తన పర్సనల్ ఫోటోస్ ని మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

ఏ మాత్రం ఆలోచించకుండా ఒక ప్రేయసిగా విగ్నేష్ తో సన్నిహితంగా ఉంటోంది. మొన్న ఆ డైరెక్టర్ బర్త్ డేకు విదేశాలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా క్రిస్మస్ సందర్బంగా విగ్నేష్ తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఆ ఫోటోలను విగ్నేష్‌ రిలీజ్ చేశాడు. రిలేషన్ సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూనే మరోవైపు ఇలా బయటపెడతుంటే వీరి బంధం విలువ ఏమిటో అర్ధం కాక నెటిజన్స్ ప్రశ్నలను విసురుతున్నారు.