Begin typing your search above and press return to search.
సినీ పరిశ్రమపై నయనతార సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 24 Dec 2022 6:51 AM GMTసౌత్ లో నయనతార క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెలుగు.. తమిళ్ భాషల్లో పెద్ద స్టార్. టాలీవుడ్ సినిమాలు రేర్ గా చేసినా ఇక్కడ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ మాత్రం వెరీ స్పెషల్. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ ఆమె. అనుష్క.. కీర్తి సురేష్ లాంటి వారు ఎంత మంది పోటికొచ్చినా...ఆమెను కొట్టే సత్తా మాత్రం ఇప్పట్లో ఎవరికీ లేదు.
గత కొన్నేళ్లగా టాలీవుడ్ లో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. హీరో రేంజ్.. సినిమా బడ్జెట్.. మ్యాటర్ ఉన్న దర్శకుడా? కాదా? అన్న విషయాలు ఆలోచించి సంతకం చేస్తుంటుంది. ఆమెతో నటించాలని చాలా మంది హీరోలు ఆశపడుతున్నా? ఆ ఛాన్స్ మాత్రం అందరికి ఇవ్వదు...కొందరికి మాత్రమే. ఆమె నిర్ణయాలకు దర్శక నిర్మాతలు కూడా కట్టుబడాలి.
తను దర్శక.. నిర్మాతలు చెబితే వినే టైప్ కాదు. ఆరకంగా రెండు పరిశ్రమలను నయన్ కొంత కాలంగా శాషిస్తుంది. అందుకే కొన్ని సంవత్సరాలుగా కేవలం నటనకు మాత్రమే పరిమితమైంది. సినిమా ప్రమోషన్లకు మాత్రం హాజరు కానీ ఏకైక హీరోయిన్. ఒక సినిమాకు సంతకం చేసే ముందే ప్రమోషన్ కు రానని కరాఖండీగా చెప్పేస్తుంది. అందుకు నిర్మాత ఒకే అంటేనే సంతకం చేస్తుంది.
లేదంటే ఎన్నికోట్లు పారితోషికం ఇస్తామన్నా? ప్రచారం అనేసరికి సారీ చెప్పేస్తుంది. ఎంత పెద్ద హీరో అయినా సరే ప్రమోషన్.. గిమోషన్ అక్కడ జాన్తా నయ్. అయితే ఇలా ప్రమోషన్ కి ఎందుకు ఢుమ్మా కొడుతుందని మీడియాలో చాలాసార్లు ప్రచారం సాగింది? ఆమెను నేరుగానూ చాలా మంది అడిగారు. కానీ ఇంతవరకూ ఎక్కడా ఆ విషయం చెప్పలేదు.
అయితే తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైతే? సినిమా ఇండస్ర్టీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ర్టీలో హీరోయిన్లకు విలువ లేదు. చాలా కాలం పాటు వాళ్లకి ఓ విలువ ఉంటుందని భావించా . కొంత కాలం చూసా. కానీ అది జరిగే పని కాదని అర్ధమైంది. అప్పటి నుంచి సినిమా ప్రమోషన్లకు రావడం మానేసా. ఇది నేను బలంగా తీసుకున్న ఓ గీత' అనేసింది. దీంతో కొన్ని రకాల కథనాలికి నయన్ ఆ రకంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.