Begin typing your search above and press return to search.

అలాంటి కండీషన్స్ పెట్టిన నయన

By:  Tupaki Desk   |   11 Jan 2018 10:26 AM IST
అలాంటి కండీషన్స్ పెట్టిన నయన
X
సినిమాలో మాస్ ఆడియోన్స్ యాక్షన్ సీన్స్ ని ఎంతగా ఇష్టపడతారో అలాగే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లను కూడా అదే స్థాయిలో ఇష్టపడతారు. ముఖ్యంగా అభిమానులు అనే వర్గం వారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి హీరో హీరోయిన్ జోడి సక్సెస్ కొడితే నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు అదే స్థాయిలో బాలకృష్ణ నయనతార నటించిన జై సింహా సినిమాపై కూడా ఉన్నాయి.

కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కెఎస్.రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య 102వ సినిమా జై సింహ సినిమాపై ప్రస్తుతం అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నయనతార - బాలయ్య జోడి సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్. కానీ ఈ సినిమాలో వారిద్దరి మధ్య అంత గట్టిగా రొమాన్స్ సీన్స్ ఏమి ఉండవని తెలుస్తోంది. కెమిస్ట్రీ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు అని టాక్. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన సింహా - శ్రీరామ రాజ్యం సినిమాలు ఎంతగా హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.

రెండు సినిమాల్లో ఇద్దరి జోడి అందరిని ఆకట్టుకుంది. కానీ నయనతార సినిమాకు సైన్ చేసేముందు హీరోతో ఇంటిమేట్ సన్నివేశాలను చేయనని కండిషన్స్ పెట్టిందట. అలాగే తెలుగు స్టైల్ లో ఉండే డ్యాన్సు స్టెప్పులను కూడా ఆమె చేయలేనని ముందే దర్శకుడితో తన డిమాండ్స్ ని చెప్పిందట. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. మరి మూడవసారి ఈ కాంబో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.