Begin typing your search above and press return to search.

సైరాలో న‌య‌న్.. అదీ సంగతి

By:  Tupaki Desk   |   17 Feb 2018 1:28 PM GMT
సైరాలో న‌య‌న్.. అదీ సంగతి
X
రామ్‌ చ‌ర‌ణ్ త‌న సొంత‌బ్యాన‌ర్‌ లో నిర్మిస్తున్న సినిమా సైరా న‌ర‌సింహా రెడ్డి. చిరంజీవి 151వ చిత్రంగా తెర‌కెక్కుతుండ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అంచ‌నాలే కాదు అదే రేంజ్ లో గాసిప్పులు కూడా. అస‌లింత‌వ‌ర‌కు ఆ సినిమాలో హీరోయిన్ ఎవ‌రో కూడా క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. కొంద‌రు న‌య‌న్ ఉందంటారు... మ‌రికొంద‌రు త‌ప్పుకుందంటారా? అస‌లు ఏదీ నిజం?

న‌య‌న‌తార సైరాలో చేస్తుంద‌నేదే నిజం. ఆమె సినిమా నుంచి త‌ప్పుకోలేదు. ఆ పాత్ర‌కోసం దాదాపు రూ.3 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ట‌. ఆమె కోసం అంత‌మొత్తాన్ని ఇవ్వ‌డానికి నిర్మాత‌లు కూడా ఒప్పుకున్నార‌ట‌. అందుకేనేమో హీరోయిన్ల‌లో న‌య‌న్ ను మాత్ర‌మే సూప‌ర్ స్టార్ అని పిల‌వ‌డం ప్రారంభించారు. సౌతిండియా హీరోయిన్ల‌లో న‌య‌న్ రెమ్యున‌రేష‌నే ఎక్కువ‌. ఏ హీరోయిన్ కూడా ఆ రేంజ్‌ లో డిమాండ్ చేయ‌డం లేదు. సినిమా హిట్‌ - ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సాగిపోతోంది న‌య‌న్ కెరీర్‌. త‌మిళంలో కుర్ర హీరోల ప‌క్క‌న కూడా న‌టించేస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ స‌త్తా చూపిస్తోంది. మొత్త‌మ్మీద ప్ర‌భుదేవాతో ల‌వ్ ఫెయిల్యూర్ అయ్యాక‌... అమ్మ‌డికి బాగా క‌లిసొస్తున్న‌ట్టు ఉంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1840 కాలం నాటి కథ కావ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టే భారీ సెట్స్‌ను వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం స్కెచ్ లు వేయ‌డానికే 15 మంది పనిచేస్తున్నారట‌.