Begin typing your search above and press return to search.
ఆ స్పీడ్ కి అడ్డంగా నుంచున్న నయన్
By: Tupaki Desk | 8 Sep 2016 5:33 AM GMTట్యాలెంటెడ్ బ్యూటీ నయనతార.. సినిమాలను సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసే రేంజ్ కి ఎప్పుడో వచ్చేసింది. పెర్ఫామెన్స్ బేస్డ్ సినిమాలు.. గ్లామర్ రోల్స్ తో పాటు.. హారర్ సినిమాలను కూడా చేసేస్తోంది నయన్. గతేడాది ఈ భామ చేసిన 'మాయ'ను హారర్ చిత్రాల ప్రేమికులు అసలు మర్చిపోలేరు. ఇప్పుడో డోరా అంటూ మరోసారి నయన్ మెయిన్ రోల్ లో ఓ సినిమా వస్తోంది.
డోరా అంటే అర్థం దేవుడిచ్చిన బహుమతి. ఈ మూవీలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ ను యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చిమ్మచీకటిలో స్పీడ్ గా వస్తున్న ఓ కారుకు నయన్ అడ్డంగా నుంచుని ఉంటుంది. ఈ బ్యూటీని వెనకనుంచి మాత్రమే చూపించినా.. ఆ పోస్టర్ లో కనిపిస్తున్నది నయనతారే అని అభిమానులు ఈజీగానే గుర్తు పట్టేస్తారు లెండి.
మొదట ఈ చిత్రానికి టిక్.. టిక్.. టిక్.. అనే టైటిల్ ఫిక్స్ చేస్తారనే టాక్ వచ్చింది కానీ.. చివరకు డోరాను ఫైనల్ చేసింది యూనిట్. దాస్ రామస్వామి డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి సర్కునమ్ నిర్మాత. ఇప్పటికే ఈ డోరా మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు తంబి రామయ్య ఈ హారర్ థ్రిల్లర్ లో నయన్ తండ్రిగా కనిపించనున్నాడు.