Begin typing your search above and press return to search.
నయనతార కూడా దొరే
By: Tupaki Desk | 5 July 2016 4:56 AM GMTఈమధ్యే దొర పేరుతో ఓ హార్రర్ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కట్టప్ప సత్యరాజ్ - ఆయన తనయుడు శిబిరాజ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన జాక్సన్ దొరై అనే తమిళ చిత్రం తెలుగులో దొరగా డబ్ అయ్యింది. ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడు నయనతార కూడా దొరగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయనతార ప్రధాన పాత్రధారిగా తమిళంలో దాస్ దర్శకత్వంలో ఓ హార్రర్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రానికే దొర అనే పేరును కన్ఫర్మ్ చేశారు.
తమిళంలోనే దొర అని పెట్టారంటే మరి తెలుగులో ఏ పేరు పెడతారో చూడాలి. నయనతార ఓ స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంతకాలంగా హారర్ కథలతో తెరకెక్కే చిన్న కథల్నీ ఒప్పుకొంటూ సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా చేసిన మయూరి ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మరో థ్రిల్లర్ చేసింది. అదే దొరగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ చిత్రంలో నయన్ ఎలా కనిపిస్తుందో, ఎలా భయపెడుతుందో చూడాలి. తమిళంలో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.