Begin typing your search above and press return to search.

నయనా.. నీకిది తగునా!!

By:  Tupaki Desk   |   1 Aug 2016 11:30 AM GMT
నయనా.. నీకిది తగునా!!
X
కొంతమంది హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే.. హీరో ఎవరైనా-భాష ఏదైనా డైరెక్టర్ సూచన మేరకు నటించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ కొందరు మాత్రం ఆయా హీరోలను బట్టి.. భాషలను బట్టి బిహేవ్ చేస్తుంటారు. ఇలా రకరకాలుగా ప్రవర్తించేవారిలో నయనతారను ప్రముఖంగా చెప్పుకోవాలి.

కోలీవుడ్ మూవీ ఇరుమగన్ లో ఈమె నటిస్తున్న తీరు.. చేస్తున్న ఎక్స్ పోజింగ్.. వేసుకుంటున్న డ్రసింగ్ చూస్తే నయన్ ఎంత హాట్ గా చేస్తోందో అనిపిస్తుంది. అలాగే విక్రమ్ తో మహా క్లోజ్ గా ఇంటిమేట్ గా కూడా కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి సీన్స్ నే బాబు బంగారంలో వెంకీతో చేయాల్సిందిగా కోరాడు దర్శకుడు మారుతి. కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో.. పెళ్లీడుకు ఎదిగిన పిల్లలున్న వ్యక్తితో అంత క్లోజ్ గా చేయడం తన వల్ల కాదని తప్పించేసుకుంది.

ఇక్కడ విషయం ఏంటంటే.. విక్రమ్ వయసు కూడా ఫిఫ్టీ ప్లస్. పైగా ఈ హీరోకి కూడా పెళ్లీడుకొచ్చిన పిల్లలున్నారు. కోలీవుడ్ మూవీస్ విషయంలో లేని అభ్యంతరాలు తెలుగు సినిమాల దగ్గర మాత్రమే వస్తున్నాయి. నయనా.. నీకిది తగునా అని నిలదీసేవాళ్లు లేకే ఇలాంటి హీరోయిన్స్ రెచ్చిపోతున్నారని చెప్పక తప్పదు.