Begin typing your search above and press return to search.
లేడీస్ కే సాయపడుతున్న నయన్
By: Tupaki Desk | 13 Dec 2015 5:57 AM GMTతెలుగమ్మాయ్ శ్రీదివ్య చెన్నయ్ వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం ఇచ్చి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ల వాలకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చిన్నా చితకా హీరోయిన్ లే బెటర్.. పెద్ద మనసుతో భారీ విరాళాలు ఇచ్చి కొంతలో కొంత బెటర్ అనిపించారు. కానీ సీనియర్ నటీమణులు - చుక్కల్లో పారితోషికాలు అందుకునే స్టార్ హీరోయిన్ లు మాత్రం పిల్లికి భిక్షం వేయకుండా చోద్యం చూస్తూ కూచోవడం విమర్శలకు తావిచ్చింది
త్రిష - ఇలియానా - నయనతార - హన్సిక లాంటి స్టార్లు అసలేం చేస్తున్నట్టు? చెన్నయ్ వరదల్లో కొట్టుకుపోతే చోద్యం చూస్తున్నారా? అంటూ క్రిటిక్స్ ఏకి పారేస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకొచ్చిన రాద్ధాంతం అనుకుందో ఏమో.. కాస్త ఆలస్యంగానైనా అందాల నయనతార స్పందించింది. నయన్.. వరదబాధిత ప్రాంతాల్లో సంచారం చేసి స్వయంగా ఆడవారి ఆలనాపాలనా చూస్తోంది. ఇప్పటికే 1000 డ్రెస్సుల్ని లేడీస్ కి అందించింది. ఎక్స్ క్లూజివ్ గా ఆడవారిని ఆదుకునే బాధ్యతను నయనతార చేపట్టింది. చెన్నయ్ ఇప్పుడిప్పుడే వరద నుంచి బైటపడి కోలుకుంటోంది. మరో వారంలో పూర్తిగా అన్ని వ్యవస్థలు యథాస్థితికి వచ్చే ఛాన్సుందని చెబుతున్నారు.
ఎనీ వే .. లేటుగా వచ్చినా నే లేటెస్టుగా వస్తా.. అన్నట్టే ఉంది నయన్ వ్యవహారం. నయన్ సరే మిగతా స్టార్ హీరోయిన్లంతా ఏమైనట్టు? సమంత ఒక్కతే 30 లక్షలు విరాళం ఇచచిన సంగతి తెలిసిందే.