Begin typing your search above and press return to search.

బాబాయి అబ్బాయిలపై లేడీ సూపర్ స్టార్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   21 Dec 2022 9:47 AM GMT
బాబాయి అబ్బాయిలపై లేడీ సూపర్ స్టార్‌ కామెంట్స్‌
X
లేడీ సూపర్ స్టార్‌ నయనతార తాజాగా నటించిన కనెక్ట్‌ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నయనతార పాల్గొంటోంది. నయనతార సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనక చాలా సంవత్సరాలు అయ్యింది. పెళ్లి తర్వాత నయన్‌ మొదటి సారి ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చింది.

సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వని.. సినిమాల యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనని నయనతార ఈసారి మాత్రం కనెక్ట్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారణం ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాను నిర్మించడమే అంటూ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నయనతార మీడియాతో మాట్లాడుతూ తెలుగు స్టార్‌ హీరోల గురించి ఆసక్తికర వ్యాక్యలు చేసింది. ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ గొప్ప డాన్సర్‌ అంటూ కామెంట్ చేసింది. డాన్స్ షూటింగ్ ఉన్న సమయంలో కనీసం ప్రాక్టీస్ చేయకుండానే షూటింగ్‌ కు వచ్చి డైరెక్ట్‌ గా ఒక్కసారి చూసి డాన్స్ చేస్తాడు.

డాన్సర్స్ కంటే కూడా బెటర్‌ గా వేశాడు అనిపించేంత బాగా ఎన్టీఆర్‌ డాన్స్ చేస్తాడని నయనతార పేర్కొంది. డాన్స్ రిహార్సల్స్ చేయకుండా షూట్ కు రెడీ అయ్యే ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ అంటూ నయనతార చెప్పుకొచ్చింది. సెట్‌ లో ఎన్టీఆర్ ను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు అంటూ నయన్‌ పేర్కొంది.

బాలకృష్ణ గారితో మరో టేక్ అడిగేందుకు ప్రతి ఒక్కరు భయపడుతారు. కాని ఆయన చాలా హ్యాపీ పర్సన్‌. ఆయన తో వర్క్‌ చాలా జాలీగా ఉంటుందని నయనతార పేర్కొంది. రవితేజ తన యొక్క బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఇక చిరంజీవి గారు ఎప్పుడు కూడా తన యొక్క స్టార్‌ డమ్‌ ను ప్రదర్శించరు. వెంకటేష్ గారు ఫ్యామిలీ.. నాగార్జున గారు చార్మింగ్‌ అంటూ నయనతార వ్యాఖ్యలు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.