Begin typing your search above and press return to search.

కనెక్ట్ కోసం ప్రమోషన్స్ అదిరేలా చేస్తున్న నయనతార..!

By:  Tupaki Desk   |   22 Dec 2022 7:46 AM GMT
కనెక్ట్ కోసం ప్రమోషన్స్ అదిరేలా చేస్తున్న నయనతార..!
X
లేడీ సూపర్ స్టార్ గా నయనతార అభిమానులతో కీర్తింపబడుతోంది. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న నయనతారకు దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీకి నయనతార వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఆమె మాత్రం సినిమా ప్రమోషన్స్ పెద్దగా హాజరు కాదనే అపవాదు ఉంది.

సినిమా చేసే సమయంలోనే నయనతార అలాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. అది ఆమె వ్యక్తిగత విషయమైనప్పటికీ తన సినిమాను తానే ప్రమోట్ చేయకపోతే ఎలా అనే కామెంట్స్ విన్పించేవి. అయినప్పటికీ నయనతార వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకొని వెళ్లిపోయింది.

నయనతార తన కెరీర్లో మొత్తం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అప్పుడెప్పుడో 'శ్రీరామరాజ్యం' సినిమా కోసం ఆమె ప్రమోషన్స్ చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ బయటికి వచ్చి తన సినిమాలను ప్రమోట్ చేసిన సందర్భాల్లేవు. అయితే పెళ్లి తర్వాత నయనతార ప్రమోషన్స్ విషయంలో మనసు మార్చుకున్నట్లు కన్పిస్తోంది.

కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ కుదేలై పోయింది. ఈ క్రమంలో అభిమానులను థియేటర్లకు రప్పించాలని హీరో హీరోయిన్లు తప్పనిసరిగా ప్రమోషన్స్ చేయాల్సి వస్తోంది. దీనిని నయనతార గుర్తించినందునే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుందనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు 'కనెక్ట్' సినిమాకు ఆమె భర్త విఘ్నేశ్ డైరెక్టర్ గా ఉండగా నయన్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఈ రెండు కారణాలు కూడా 'కనెక్ట్' సినిమాను ఆమె ప్రమోట్ చేసేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నయనతార గతంలో ఎన్నడూ లేని విధంగా తన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను ఫ్యాన్స్ తో తిలకించేందుకు రెడీ అయింది. నేడు చెన్నైలోని ఓ థియేటర్లో నయనతార అభిమానులతో కలిసి సినిమా చూడనుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా కనెక్ట్ సినిమా హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. లాక్ డౌన్ లో తన కుమార్తె ప్రవర్తన లో భయాంకరమైన మార్పులు రావడాన్ని తల్లి గమనిస్తోంది. ఈ క్రమంలోనే భూత వైద్యుడిని సహాయం కోరుకుంది. ఆ తర్వాత సస్పెన్స్ థిల్లర్ గా కథ ముందుకు నడువనుందని తెలుస్తోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.