Begin typing your search above and press return to search.
నయన్ ఏం మెరిసిపోతోందో
By: Tupaki Desk | 26 Feb 2016 6:50 AM GMTమలయాళీ ముద్దుగుమ్మ నయనతార.. అందానికి అర్ధం చెబుతా అన్నట్లుగా ఉంటుంది. ఏ తరహా పాత్రనైనా చేసేయగలగడం, పెద్ద స్టార్లతో పాటు కుర్ర హీరోల పక్కనా నటించగల తెగువ ఉండడంతో అమ్మడి రేంజ్ ని అందుకోవడం మిగతావారికి కష్టంగానే ఉంది. ఒక వైపు పర్సనల్ లైఫ్ లో ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ లు వచ్చినా.. ప్రతీసారీ అక్కడి ఓటమిని విజయానికి మెట్లుగా చేసేసుకుని ఎదిగిపోతోంది నయన్.
రీసెంట్ గా ఓ జ్యూవెలరీ యాడ్ కోసం నయనతార కనిపించిన తీరు ఇది. చీరకట్టులోఈ ముగ్ధ ఇంత మనోహరంగా ఉంటుందా అనిపించడం ఖాయం. మోడ్రన్ డ్రస్సుల్లో అందాలు ఆరబోసి ఆకట్టుకోవడం అందరూ చేసేదే. కానీ నయన్ మాత్రం సాంప్రదాయ చీరకట్టులోనూ మిలమిలా మెరిసిపోగలదు. అన్నిటికంటే పేరుకు తగ్గట్లు ఈ భామ నయనాలే అసలు అట్రాక్షన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమైనా 13 ఏళ్లుగా కెరీర్ కంటిన్యూ చేస్తున్నా.. ఏటేటా తనలోని గ్లామర్ ను పెంచుకుంటూ దూసుకుపోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.. ఒక్క నయన్ కి తప్ప.
ప్రస్తుతం తమిళ్ లో హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న నయనతార.. ఇప్పుడు ఐదు తమిళ్ మూవీస్ కి సైన్ చేసేసింది. తెలుగులో అయితే వెంకీ సరసన బాబు బంగారంలో నటిస్తోంది. మూడేళ్ల క్రితం గోపీచంద్ తో కలిసి బి.గోపాల్ దర్శకత్వంలో నటించిన ఓ మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.