Begin typing your search above and press return to search.
ఫొటో స్టోరీ: నో డౌట్.. పాప బంగారమే!
By: Tupaki Desk | 4 Jun 2016 2:37 PM GMTమారుతి తన సినిమాకి బాబు బంగారం అని పేరెట్టేశాడు కానీ... నయన్ ఇంత క్యూట్ గా కనిపిస్తుందని ముందే తెలిసుంటే పాప బంగారం అని మార్చేసేవాడేమో. అవును మరీ... ఇక్కడ నయనతార ప్రెట్టీనెస్ ఓవర్ లోడ్ అనిపించేలా కనిపిస్తోంది. ఇలా చూసి కూడా ముదురు భామ ఎవరైనా అనగలరా? లేలేత సోయగాలతో కుర్రభామలకి మరికొన్నేళ్లు గట్టి పోటీ తప్పదనిపించేలా తయారైంది నయనతార. ఫొటోలోనే ఇలా ఉందంటే, సినిమాలో ఇంకెంత అందంగా కనిపిస్తుందో! స్వతహాగా నయనతార కూడా బాబుబంగారం సినిమాపై బోలెడంత కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తోంది. వెంకటేష్ దీ - నాదీ హిట్టు కాంబినేషన్ అని గుర్తు చేస్తూ ఓ పాటలోని స్టిల్ ని బయటపెట్టింది నయనతార.
ఒక తెలుగు సినిమాని ఆమె ఈ రేంజ్ లో ప్రమోట్ చేస్తుండడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. మారుతి ఏరికోరి వెంకీ - నయనతార కాంబినేషన్ ని సెట్ చేశాడు. ఇద్దరినీ కూడా అందంగా చూపించారని ఫిల్మ్ నగర్ జనాలు చెబుతున్నారు. పోస్టర్లు చూస్తుంటే ఆ విషయం నిజమే అని అర్థమవుతోంది.