Begin typing your search above and press return to search.

సహజీవనమా? పెళ్లి చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   2 Dec 2016 10:30 PM GMT
సహజీవనమా? పెళ్లి చేసుకున్నారా?
X
అందం కంటే ఆకర్షించే గుణం ఎక్కువగా ఉన్న భామగా నయనతారను చెప్పొచ్చు. ఈ డస్కీ బ్యూటీని చూసి తెగ ఇదైపోయే చాలామంది తీరును చూసి.. ఇంతకీ అమ్మడిలో అంత ఆకర్షించేగుణం ఏమిటన్నది భూతద్దం వేసుకొని వెతికితే..ఒక పట్టాన అర్థం కాదు. ఎంత వెతికినా.. ఎక్కడికక్కడ ఏదో ఒక అందంతో కనిపించేఈ వయ్యారి.. తన లవ్ ఎఫైర్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.

మీడియాతో చాలా చాలా తక్కువగా మాట్లాడే అలవాటున్న నయన.. తన మీద వచ్చే రూమర్ల మీద పెద్దగా రియాక్ట్ కారు. ఇదొకటైతే.. అమ్మడికి ఒక లవ్ ట్రాక్ తర్వాత కాస్త గ్యాప్ తో మరో లవ్ ట్రాక్ మొదలు కావటం కూడా ఆమె తరచూ వార్తల్లో ఉండటానికి కారణంగా చెప్పొచ్చు. మొదట్లో హీరో శింబుతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ మలబార్ అందం.. తర్వాతి రోజుల్లో బ్రేకప్ అయిపోయి.. కొరియో గ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం మొదలెట్టారు.

ఈ లవ్ ట్రాక్ లో ఆమె పడిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. ఆమెను సమర్థించే వారి కంటేకూడా వేలెత్తి చూపే వారే ఎక్కువన్నట్లుగా పరిస్థితి ఉండేదని చెబుతారు. అయినప్పటికీ ఎవరిని కేర్ చేయకుండా తను..తన ప్రేమ అన్నట్లుగా ఉన్న నయన.. ప్రభుదేవాతో పెళ్లి వరకూ వెళ్లారు. ఒక దశలో చెట్టాపట్టాలు వేసుకుంటూ బయట ఫంక్షన్లకు కూడా హాజరయ్యారు. త్వరలోనే స్వీట్ న్యూస్ అని చెబుతూనే.. హటాత్తుగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో.. వారి మధ్య బ్రేకప్ చోటు చేసుకుంది.

ఈ లవ్ ఫెయిల్ అయ్యాక.. నయన కొంతకాలం ఒంటరిగా ఉన్నప్పటికీ.. తాజాగా ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్ లవ్ లో పడినట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఎప్పటి మాదిరే వారి లవ్ ట్రాక్ మీద వార్తలు వచ్చినా ఆమె మాత్రం కామ్ గానే ఉండిపోయారు. తాజాగా నయన గురించి సరికొత్త మాట ఒకటి వినిపిస్తోంది. విఘ్నేశ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నయన.. తాజాగా తాను కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో విఘ్నేశ్ తో పాటు ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యన ఓనమ్ పండగను ఇరువురు కలిసి చేసుకోవటం.. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోల్లో వారి మధ్యనున్న దగ్గరితనం చూసిన వారంతా ఏదేదో.. ఉందన్న టాక్ అంతకంతకూ పెరిగిపోతోంది.

వీరిద్దరి రిలేషన్ మీద కొందరేమో.. వీరికి ఇప్పటికే పెళ్లి అయిపోయిందని చెబుతుంటే.. మరికొందరు మాత్రం.. సహజీవనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమన్నది పక్కన పెడితే.. ఒకేఇంట్లో ఇద్దరూ కలిసి ఉండటం మాత్రం నిజమన్న మాటను పలువురు చెబుతున్నారు. ఇన్ని పుకార్లు షికార్లు చేసే కన్నా.. నయన తన మీద వస్తున్న వార్తలపై ఒక్కసారి రియాక్ట్ అయిపోతే సరిపోతుంది కదా అని ఫీల్ అవుతున్నోళ్లు ఉన్నారు. ఎవరి ఫీలింగ్స్ కోసమో నయన మాట్లాడుతుందనుకోవటం అమాయకత్వమే అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/