Begin typing your search above and press return to search.

ఆ విషయం బయట చెప్పుకోలేక కుమిలి పోతుందట!

By:  Tupaki Desk   |   3 May 2020 5:30 PM GMT
ఆ విషయం బయట చెప్పుకోలేక కుమిలి పోతుందట!
X
సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఎవరైనా ఠక్కున నయనతార పేరు చెప్తేస్తారు. తమిళం మరియు తెలుగులో ఈమె ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ ను కూడా దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్‌ పరంగా సూపర్‌ స్టార్‌ అయినా వ్యక్తిగత విషయాల్లో మాత్రం పలు వివాదాలను విమర్శలను ఎదుర్కొంటూ వస్తుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ కు రాదంటూ విమర్శలు ఉన్న హీరోయిన్‌ కు అంతకు మించి ప్రేమ ఫెయిల్యూర్స్‌ వార్తలు తలనొప్పిని కలిగిస్తున్నాయి.

కెరీర్‌ ఆరంభంలో శింబుతో ప్రేమ.. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమ ఆమె జీవితంలో కీలక పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ప్రభుదేవాతో పెళ్లి అయినట్లే అనుకున్నారు. కాని చివరి నిమిషయంలో పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. వరుసగా లవ్‌ ఫెయిల్యూర్స్‌ అవుతున్నా కూడా సినిమాల్లో మాత్రం బిజీగానే ఉంది. వరుస సినిమాలు చేస్తూనే విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో పడినది. వీరిద్దరు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారనే విషయం అందరికి తెలుసు. నయన్‌ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా.. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు.

సుదీర్ఘ రిలేషన్‌ షిప్‌ లో వివాదాలు మొదలయ్యాయట. దాంతో ఇద్దరు బ్రేకప్‌ అయ్యారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నయనతార ఈ విషయాన్ని అధికారికంగా వెళ్లడి చేసేందుకు ఆసక్తిగా లేదు. ఇప్పటికే రెండు బ్రేకప్‌ లు అయిన ఈమె మూడవ బ్రేకప్‌ ను తట్టుకోలేక పోతుందట. ఈ విషయం బయటకు చెప్పినా కూడా తనపైనే విమర్శలు వస్తాయంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుని కన్నీరు పెట్టుకుందట. బయటకు ఈ విషయాన్ని చెప్పలేక నయన్‌ కుమిలి పోతుందని తమిళ వెబ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయమై విఘ్నేష్‌ శివన్‌ ను అయినా స్పందించేందుకు తమిళ మీడియా ప్రయత్నించగా ఆయన కూడా అందుబాటులోకి రాలేదట.