Begin typing your search above and press return to search.
అప్పుడూ ఇప్పుడూ నయన్ ఒకేమాట!
By: Tupaki Desk | 22 Aug 2019 1:30 AM GMTనిన్న ముంబైలో జరిగిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లీడ్ క్యాస్టింగ్ లో మిస్ అయ్యింది ఇద్దరు. ఒకరు అమితాబ్ బచ్చన్ రెండు నయనతార. ఇద్దరివీ కీలక పాత్రలే. బిగ్ బి ఆబ్సెంట్ కు కారణాలు అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆయన ఇప్పుడు మిస్ అయినా ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే తీరతారు. మెగాస్టార్ తో ఉన్న బాండింగ్ అలాంటిది. కానీ నయన్ కనిపించకపోవడం పట్ల పలు కామెంట్లు విమర్శలు కూడా వచ్చాయి.
కర్ణాటక నుంచి సుదీప్ తమిళనాడు నుంచి విజయ్ సేతుపతి లాంటి స్టార్ లు వచ్చినప్పుడు నయన్ కూడా ఉండొచ్చు కదా అనే మాట వచ్చింది. కానీ ఇక్కడ నయనతారను అంతగా తప్పుబట్టాల్సిన పని లేదు. ఇప్పటిదాకా నయన్ చేసిన సినిమాల వరస చూసుకుంటే దేనికీ ప్రత్యేకంగా ప్రమోషన్ చేసింది లేదు. ఆఖరికి తన ఇమేజ్ మీదే మార్కెట్ చేసుకున్న డోరా - ఐరా లాంటి వాటికి కూడా దూరంగానే ఉంది. హీరో రేంజ్ ఎంతున్నా తాను ప్రమోషన్లకు దూరంగా ఉంటానని సైన్ చేసే సమయంలోనే నయనతార స్పష్టంగా చెబుతుందని చెన్నై మీడియా వర్గాలు ఎప్పుడో చెప్పాయి.
అందులోనూ నయన్ ఇప్పుడు విజయ్ బిగిల్ రజనీకాంత్ దర్బార్ షూటింగ్ లతో బిజీగా ఉంది. రెండు షూటింగులు పీక్స్ లో ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా సైరా ఈవెంట్ కు నయన్ రాకపోవడానికి కారణాలు అడ్డుగా నిలిచాయి. ఒకవేళ బై ఛాన్స్ చెన్నైలో ఏదైనా ఈవెంట్ జరిగితే కనిపించవచ్చేమో కానీ ఇంతకు మించి ఆశించడం కూడా కరెక్ట్ కాదు. అందుకే నయనతార కండిషన్ గురించి అవగాహన ఉన్నవాళ్లు సైరా ఈవెంట్ లో తను కనిపించకపోవడం పట్ల ఎలాంటి ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు.