Begin typing your search above and press return to search.
నయనతార ప్రమోషన్స్ కా.. నిజమే..!
By: Tupaki Desk | 9 Sep 2022 9:30 AM GMTతమిళ, తెలుగు భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. రెండు ఇండస్ట్రీల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న నయనతార తను నటించిన సినిమాల ప్రమోషన్స్ కి మాత్రం రాదు అన్నది అందరికి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఇదే పద్దతిని పాటిస్తూ ఏ స్టార్ సినిమా అయినా సరే ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. సినిమా పూర్తయిందా..ఇక ఆ ప్రాజెక్ట్ గురించి నయన పెద్దగా పట్టించుకోదు.
అయితే గతంలో బాలకృష్ణ నటించగా సీనియర్ డైరెక్టర్ బాపు తెరకెక్కించిన 'శ్రీరామరాజ్యం' ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొంది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం, తను సీత పాత్రలో నటించడం.. అంతే కాకుండా ఇ సినిమా తరువాత తను ప్రభు దేవాతో పెళ్లికి రెడీ అవుతున్నానని, ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని భావించిన నయనతార 'శ్రీరామరాజ్యం' సినిమా కోసం తన పంథాకు భిన్నంగా ప్రమోషన్స్ లో పాల్గొంది.
చివరి రోజు సెట్ లోనూ భావోద్వేగానికి గురై ఎమోషనల్ అయింది. ఆ తరువాత సినిమా రిలీజ్ సమయంలో పలు మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఆ తరువాత నయనతార పెళ్లి ఆగిపోవడం, ప్రభుదేవా తో విడిపోవడం తెలిసిందే.
ఆ తరువాత నుంచి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన నయనతార సినిమా ప్రమోషన్స్ కు దూరంగా వుంటూ వస్తోంది. లేడీ ఓరియోంటెడ్ ఫిల్మ్ అయినా సరే ప్రమోషన్స్ కి రానంటూ ముందే చెప్పేస్తూ వస్తోంది.
ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' విషయంలో నయన్ తన పంథాకు భిన్నంగా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్ కాదు.. చిరుకు చెల్లెలి పాత్రలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. దసరా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్న ఈమూవీ ప్రమోషన్స్ కోసం నయనతార రానుందని తెలుస్తోంది.
త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ వేడుకలో నయనతార పాల్గొనబోతోందని తెలుస్తోంది. పెళ్లి తరువాత తెలుగు ప్రేక్షకులని కలవాలనే ఉద్దేశ్యంతో నయనతార ఈ ఈవెంట్ కు రాబోతోందని చెబుతున్నారు. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.