Begin typing your search above and press return to search.
లేడీ సూపర్ స్టార్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ హ్యాపీ
By: Tupaki Desk | 4 May 2019 10:44 AM GMTస్టార్ హీరోలకు జోడీగా నటించడంతో పాటు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన స్టార్ హీరోయిన్ నయనతార సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకుంది. ఎవరేం అన్నా కూడా నయన్ ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ అని, ఆమెకు తమిళం, తెలుగు, మలయాళంలో స్టార్ స్టేటస్ ఉందని, ఆమె నటించే సినిమాలు మూడు భాషల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయని, అందుకే నయన్ సౌత్ లేడీ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాల విషయంలో నయన్ స్థాయికి వచ్చే హీరోయిన్ ప్రస్తుతం సౌత్ లో ఎవరు లేని చెప్పుకోవచ్చు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం ఆమె కాస్త కఠిన పరిస్థితులు ఎదుర్కొంది.
రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె జీవితం అప్స్ అండ్ డౌన్ అయ్యింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా విఘ్నేష్ శివన్ తో నయన్ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తుంది. ఇద్దరు సహజీవనంలో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. షూటింగ్స్ గ్యాప్స్ దొరికితే చాలు ఇద్దరు విదేశాలకు చెక్కేసి హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగేళ్ల ఈ రిలేషన్ షిప్ ను మరో లెవల్ కు తీసుకు వెళ్లాలని ఇద్దను నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలోనే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరుగబోతుందట.
ఇరు కుటుంబ సభ్యులు కూడా నిశ్చితార్థం, పెళ్లి గురించి చాలా రోజులుగా పోరు పెడుతున్నారట. దాంతో పెద్దల కోరిక మేరకు పెళ్లికి వీరిద్దరు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో నిశ్చితార్థం చేసుకుని, వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి జోడీ బాగుంటుందని, తప్పకుండా వీరు పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉంటారంటూ నయన్ ఫ్యాన్స్ పెళ్లి విషయమై హ్యాపీ ఫీలింగ్స్ వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్థం విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.