Begin typing your search above and press return to search.

ఎంతటి స్టార్‌ హీరో అయిన అప్పటి నుండే నయన్‌ డోంట్‌ కేర్‌

By:  Tupaki Desk   |   17 July 2020 3:30 AM GMT
ఎంతటి స్టార్‌ హీరో అయిన అప్పటి నుండే నయన్‌ డోంట్‌ కేర్‌
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతారకు కాస్త తల పొగరు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతలు అంటూ ఉంటారు. తాను నటించిన సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనదు అంటూ చెడ్డ పేరును మూట కట్టుకున్న నయనతార పారితోషికం విషయంలో కొందరు స్టార్‌ హీరోలను మరియు నిర్మాతలను కూడా ఇబ్బంది పెట్టిన సందర్బాలు ఉన్నాయంటూ గతంలో ప్రచారం జరిగింది. తన పాత్ర విషయంలో చాలా క్లారిటీగా క్లీయర్‌ గా ఉండే నయన్‌ ఐటెం సాంగ్స్‌ విషయంలో ఆసక్తి చూపించలేదు.

కెరీర్‌ ఆరంభంలో ఒకటి రెండు ఐటెం సాంగ్స్‌ చేసినా నయన్‌ స్టార్‌ డం వచ్చిన తర్వాత ఐటెం సాంగ్స్‌ జోలికి వెళ్లలేదు. ఈమద్య కాలంలో లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న నయన్‌ అంతకు ముందు కూడా ఐటెం సాంగ్స్‌ ఆఫర్‌ ను కాదనుకుంది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ నటించిన చెన్నై ఎక్స్‌ ప్రెస్‌ చిత్రంలో ఐటెం సాంగ్‌ ను ఈ అమ్మడితో చేయించేందుకు ప్రయత్నాలు చేశారట. కాని నయన్‌ ఎంతటి స్టార్‌ అయినా ఐటెం సాంగ్‌ చేసే ప్రసక్తే లేదంటూ బాలీవుడ్‌ ఆఫర్‌ ను కాదనుకుంది.

కెరీర్‌ లో ఎప్పుడైతే స్టార్‌ డం వచ్చిందో అప్పటి నుండి కూడా నయన్‌ స్టార్స్‌ అయినా సూపర్‌ స్టార్స్‌ అయినా డోంట్‌ కేర్‌ అన్నట్లుగా ప్రవర్తిస్తుందనేది కొందరి వాదన. సౌత్‌ లో హీరోల స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేసే ఏకైక హీరోయిన్‌ నయన్‌. ఆమె తనకున్న క్రేజ్‌ కు తగ్గ పారితోషికం డిమాండ్‌ చేస్తుందని కొందరు భావిస్తుండగా కొందరు మాత్రం ఆమె తలపొగరు అంటూ కామెంట్స్‌ చేసే వారు ఉన్నారు. ఇప్పటికి కూడా నయన్‌ తన పద్దతిని ఏమాత్రం మార్చుకోలేదు. లేడీ సూపర్‌ స్టార్‌ గా అభిమానులతో పిలిపించుకుంటున్న నయన్‌ స్టార్‌ హీరోలకు పోటీగా నిలుస్తోంది.