Begin typing your search above and press return to search.

మ‌ధ్య‌లో ఈ కురియ‌న్ ఎవ‌ర‌బ్బా?

By:  Tupaki Desk   |   15 May 2016 5:49 AM GMT
మ‌ధ్య‌లో ఈ కురియ‌న్ ఎవ‌ర‌బ్బా?
X
బాబు బంగారం టీమ్ విదేశాల్లో గ‌డుపుతోంది. అక్క‌డో పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. హోట‌ల్‌ లోనో - మ‌రెక్క‌డో తెలియ‌దు కానీ... బంగారంలాంటి టీమ్ వ‌స్తుంద‌ని ముందుగానే వాళ్ల పేర్ల‌తో స‌హా క‌నుక్కుని ఇలా ఛెయిర్లు అరేంజ్ చేసేశారు. ఇక్క‌డ ప్రొడ్యూస‌ర్‌ కి క‌రెక్టు సీటే వ‌చ్చింది. వెంక‌టేష్ - మారుతిలు కూడా వాళ్ల‌కి నిర్దేశించిన సీట్ల‌లోనే కూర్చున్నారు. కానీ న‌య‌న‌తారే కురియ‌న్ కోసం వేసిన సీట్లో కూర్చుంది అనుకుంటే మీరు ప‌ప్పులే కాలేసిన‌ట్టే. మ‌రింతకీ ఈ కురియ‌న్ ఎవ‌ర‌నేదేగా మీ ప్ర‌శ్న‌.

నిజంగా న‌య‌న‌తార వేరేవాళ్ల సీట్లో అస్స‌లు కూర్చోలేదండీ. ఆమె కోసం వేసిన సీట్లోనే ఆమె కూర్చుంది. న‌య‌న‌తార అస్స‌లు పేరు కురియ‌నే. పూర్తి పేరు డ‌యానా మ‌రియ‌మ్ కురియ‌న్‌. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక న‌య‌న‌తార‌గా పేరు మార్చుకుంది. విదేశాలకి వెళ్లిన‌ప్పుడు పాస్ పోర్టులోని పేరునుబ‌ట్టే వ్య‌వ‌హారాలు న‌డుస్తుంటాయి క‌దా! అలా ఇక్క‌డ న‌య‌న‌తార పేరు కురియ‌న్‌గా ఫిక్స‌యిపోయారు విదేశీ జ‌నాలు. అందుకే ఇక్క‌డ ఆమె కోసం కురియ‌న్ పేరునే కుర్చీకి ఫిక్స్ చేశారు. ఈ ఫొటోని బాబు బంగారం టీమ్ ఆన్‌ లైన్‌ లో షేర్ చేసుకుంది.

మొత్త‌మ్మీద వీళ్లు ఫారిన్ టూర్‌ ని ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నార‌న్న విష‌యం ఈ ఫొటోని చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. టీమ్ ఇంత జోష్‌ తో క‌నిపిస్తోంది కాబ‌ట్టి సినిమా కూడా అలాగే వుంటుంద‌ని ఎక్స్‌ పెక్ట్ చేయొచ్చు. సినిమా అస‌లు ఫ్లేవ‌ర్ ఎలా వుంటుందో ఈ ఫారిన్ షెడ్యూల్ అయ్యాక టీజ‌ర్‌ తో బ‌య‌ట‌పెట్టబోతోంది బాబు బంగారం టీమ్‌. వెంకీ - న‌య‌న‌తార లాంటి సక్సెస్‌ ఫుల్ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతుండ‌టంతో పాటు, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర్వాత మారుతి తీస్తున్న సినిమా ఇది.