Begin typing your search above and press return to search.
బాలయ్యకు తల్లిగా నటిస్తున్న నయన్
By: Tupaki Desk | 25 Aug 2017 11:55 AM GMTముచ్చటగా మూడోసారి బాలయ్య సరసన నయనతార నటిస్తుందని ఆశపడ్డ నందమూరి అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ 102వ సినిమాలో నయనతార లీడ్ హీరోయిన్ గా ఎంపికైందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్ కాదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి భార్యగా నయన్ నటిస్తుందని, అంతేకాదు బాలయ్యకి తల్లిగా నయన్ నటిస్తుందనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య విపరీతంగా వినిపిస్తుంది. గతంలో బాలకృష్ణ 100వ సినిమాకు నయనతారను ఎంపిక చేసుకోవడానికి క్రిష్ అండ్ టీమ్ ప్రయత్నించారు కానీ అప్పుడు ఆమె కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకోపోయింది. ఇప్పుడు ఓ గెస్ట్ రోల్ కోసం నయన తన టైమ్ ఇచ్చిందంటేనే సినిమాలో ఏదో కొత్త పాయింట్ ఉందేమో అనే సందేహాలు సినీ జనాలకు వస్తున్నాయి. మరో వైపున చిరంజీవి 151లో నయన్ హీరోయిన్ గా బుక్ అయిందనే టాక్ నడుస్తుంది. అయితే అది ఫుల్ లెంత్ పాత్రేనా లేక బాలయ్య సినిమా మాదిరిగా ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనే డిస్కషన్స్ నడస్తున్నాయి. మరి బాలకృష్ణకి తల్లిగా అలానే చిరు అప్ కమింగ్ మూవీలో నయన్ ఎలా కనిపిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.