Begin typing your search above and press return to search.

నయన్ ని మేకప్ లేకుండా చూపిస్తాడా?

By:  Tupaki Desk   |   23 Jan 2016 1:30 PM GMT
నయన్ ని మేకప్ లేకుండా చూపిస్తాడా?
X
వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. గతేడాది ఒక్కటంటే ఒక్క సినిమాలో కనిపించాడు వెంకీ. గోపాల గోపాల మూవీలో పవన్ తో కలిసి నటించాక.. మళ్లీ మూవీని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. మొత్తానికి మారుతీతో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసి, రీసెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. మారుతీ-వెంకీ కాంబినేషన్ వస్తున్న మూవీకి బాబు బంగారం అనే టైటిల్ అనుకుంటున్నారు.

ఇందులో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారనే విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రాజెక్టులో నయన్ కేరక్టర్ కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్ డేట్స్ తెలిశాయి. అసలు ఈ సినిమాలో నయనతార వెంకటేష్ కు జంటగా నటించడం లేదన్నది మెయిన్ సీక్రెట్. అంతే కాదు.. ఓ సాధారణ బ్రాహ్మణ యువతిగా కనిపించబోతోందట. అలాగే మూవీలో చాలా సేపు మేకప్ లేకుండానే ఈ కేరక్టర్ చేయబోతోందట నయనతార. అయినా సరే.. సినిమాకి మెయిన్ హీరోయిన్ మాత్రం నయన తారే. అదీ స్టోరీ తమాషా. బాబు బంగారంలో వెంకటేష్ ఓ కామెడీ పోలీస్ గా నటించనుండడం విశేషం. కేరక్టర్స్ విషయంలో చాలా ఎలర్ట్ ఉంటున్న వెంకీ..

ఎంతో అప్రమత్తంగా ఈ స్టోరీని ఎంపిక చేసుకున్నాడు. భలేభలే మగాడివోయ్ తర్వాత క్లీన్ కామెడీ చేయడంలోనూ మారుతీ సిద్ధహస్తుడని ప్రూవ్ అవడంతోనే.. ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేశాడు వెంకీ. అంతేకాదు గత రెండేళ్లలోనూ సంవత్సరానికి ఒకటే సినిమా చేసిన వెంకటేష్.. ఈ ఏఢాది మాత్రం 2 సినిమాలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకే ఏడాది ప్రారంభంలోనే మారుతీ మూవీ మొదలుపెట్టేశాడని తెలుస్తోంది.