Begin typing your search above and press return to search.
అత్తగారి విషయంలో నయన ముందు జాగ్రత్తలు!
By: Tupaki Desk | 18 Oct 2016 8:20 AM GMTభారతదేశంలో అత్తా - కోడల్లకు సంబందించిన ప్రతీ విషయం సూపర్ ఇంట్రస్టింగ్ గా ఫేమస్ అయిపోతుంటుంది. వీరి విషయంలో... "అత్తా ఒకనాటి కోడలే" అని సర్ధిచెప్పే వారూ ఉంటారు, "కోడలైన రేపటి అత్తే" అని దైర్యం చెప్పేవారూ ఉంటారు. ఇక చాలా మంది అత్తలైతే కోడళ్లను కూతుళ్లుగా చూసుకుంటుండగా, కొందరు కోడళ్లు తమ అత్తలను తల్లిలా చూసుకుంటుంటారు. వినాడానికి నమ్మశక్యంగా అనిపించినా, అనిపించకపోయినా నమ్మి తీరాలంతే!! ఒక కుటుంబ ఆనందంలో - పునాదుల్లో - జరిగే సంభరాల్లో వీరిద్దరూ కలిసి ప్రయాణిస్తేనే ఇంటికి అందం, మిగిలిన వారికి ఆనందం. ఈ విషయం పెళ్లికి ముందే గ్రహించిందో ఏమో కానీ తనకు కాబోయే అత్తగారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడిందట నయనతార. ఈ మేరకు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
విషయానికొస్తే... దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న నయనతార తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్ శివ ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. "నానూ రౌడీదాన్" అనే చిత్రం షూటింగ్ సమయంలోనే వీరిద్ధరి మధ్య ప్రేమ చిగురించిందన్నది ప్రచారంలో ఉంది. వీటికి బలం చేకురుస్తూ అప్పుడూప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలు రావడం సంగతి అలా ఉంచితే... ఈమధ్య జరిగిన ఏ కార్యక్రమానికైనా నయనతార - విఘ్నేశ్ శివ లు కలిసి హాజరవుతూ వార్తల్లోకెక్కుతున్నారు. దీంతో వీరిద్దరి ప్రేమాయణానికి సంబందించిన విషయాలు గాసిప్పులవ్వడం మానేసి వార్తలవ్వడం మొదలైంది. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా తాజాగా దర్శకుడు విఘ్నేశ్ శివ తల్లిని నయనకు పరిచయం చేయడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందట. ఈ పరిచయాన్ని మరింత బలంగా మార్చుకునే క్రమంలో ఇటీవల విఘ్నేశ్ శివ తల్లిని తన ఇంటికి ఆహ్వానించి మంచి విందు ఇచ్చిందట నయనతార.. అది కూడా ఏ ఫైవ్ స్టార్ హోటల్ నుంచో రప్పించి కాదు సుమా... నయనే స్వయంగా వంట చేసిందట. ఈ మేరకు కోలీవుడ్ వర్గాల్లో ఫుల్ ప్రచారం జరుగుతోంది.
కాగా దర్శకుడు విఘ్నేశ్ శివ తల్లిదండ్రులిద్దరూ పోలీస్ అధికారులుగా పని చేశారట. ముఖ్యంగా ఆయన తల్లి అయితే రౌడీలకు స్వప్నసింహంగా ఉండేవారట. ఆఫీసర్ గానే అలా ఉంటే ఇక కోడలి విషయంలో అని ఊహించుకుని నయన ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/