Begin typing your search above and press return to search.

ప్రేమికుడి కోసం నయన్ రిస్క్!

By:  Tupaki Desk   |   20 Jun 2018 11:40 AM GMT
ప్రేమికుడి కోసం నయన్ రిస్క్!
X
ప్రేమ గుడ్డిదే కాదు నమ్మకమైనది కూడా. ఎంత అంటే ఇష్టపడినవారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టేంత. దర్శకుడు విగ్నేష్ శివన్ తో తన అనుబంధాన్ని ఎంత సేపూ ఫొటోల్లో ఈవెంట్స్ లో చూపించడం తప్ప తానుగా ఎన్నడూ చెప్పని నయనతార తెరవెనుక మాత్రం బలమైన రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్టు కోలీవుడ్ మీడియా చాలా కాలం నుంచే కోడై కూస్తోంది. దానికి తగ్గట్టు గత రెండేళ్లుగా ప్రతి చోటా ఇద్దరు కలిసే కనిపిస్తున్నారు కూడా. తాజాగా తెలిసిన అప్ డేట్ ఏంటంటే నయన్ కు తన బాయ్ ఫ్రెండ్ ను వెండితెరపై హీరోగా చూసుకోవాలని ఉందట. దానికి దర్శకత్వం కూడా అతనే వహించాలని కోరిక.

అందుకు గాను తనే నిర్మాతగా మారి ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు సిద్ధపడినట్టుగా వచ్చిన వార్తలు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. విగ్నేష్ శివన్ ఓ మోస్తరు అందగాడే. తెరమీద చూడటం అలవాటు లేకపోవడం వల్ల మొదట కొంచెం డౌట్ గా అనిపించినా ఫేస్ లో హీరో మెటీరియల్ అయితే ఉంది. సరిగ్గా ఇదే అభిప్రాయంతో నయనతార విగ్నేష్ ను ఒప్పించే పనిలో ఉందట. మరోవైపు వినిపిస్తున్న వార్త ఏంటంటే విగ్నేష్ కు బదులు అథర్వా ను హీరోగా పెట్టి తాను నిర్మాతగా ఓ భారీ బడ్జెట్ చిత్రం నయనతార ప్లాన్ చేస్తోందని. ఇందులో ఏది నిజమో కానీ రెండు వార్తల్లో ఉన్న కామన్ పాయింట్ నయనతార నిర్మాత కావడం. విగ్నేష్ హీరో కావడం వైపే తన ఫోకస్ ఉందట.

ఇలా ఒకే సారి రెండు పడవలపై ప్రయాణం చేసి సక్సెస్ అయిన వాళ్లలో భాగ్యరాజ్-టి.రాజేంద్రన్-రవి చంద్రన్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో తన లవర్ కూడా అలా ఎందుకు సక్సెస్ కాకూడదు అనుకుందో ఏమో మరి నయనతార గట్టిగానే డిసైడ్ అయినట్టు ఉంది. సైరా నరసింహారెడ్డిలో చిరు సరసన మొదటిసారి నటిస్తున్న నయనతార అజిత్ విశ్వాసం లో కూడా ఒక కీలక పాత్ర కోసం సైన్ చేసింది. పదేళ్లు దాటుతున్నా ఇమేజ్ ఇంచు కూడా తగ్గని నయనతార ఇప్పట్లో ఫేడ్ అవుట్ ఛాన్స్ కనుచూపు మేరలో లేదు.