Begin typing your search above and press return to search.

లవ్‌ బర్డ్స్‌ జోరు మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   23 Dec 2020 2:30 PM GMT
లవ్‌ బర్డ్స్‌ జోరు మామూలుగా లేదుగా
X
స్టార్‌ లవ్ బర్డ్స్‌ నయనతార విఘ్నేష్‌ శివన్ లు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఒక వైపు విడి విడిగా సినిమాలు చేస్తూ మరో వైపు ఇద్దరు కలిసి తమ నిర్మాణంలో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇంకో వైపు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార నటిస్తోంది. ఈ సమయంలోనే తమిళంలో యువ దర్శకుడు వినోద్‌ దర్శకుడు తెరకెక్కించిన సినిమా కుజనంకల్‌ ను కొనుగోలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ జంట ఆ సినిమాను చూశారట. కంటెంట్ బాగా నచ్చడంతో సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ముందుకు వచ్చారట.

కుజనంకల్ సినిమాను హోల్‌ సేల్‌ గా నయన్‌ విఘ్నేష్‌ శివన్‌ లు కొనుగోలు చేశారంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా కంటెంట్ నచ్చడంతో ఇలా విడుదలకు ముందుకు రావడం జరిగిందని అంటున్నారు. చిన్న సినిమాలకు ఇది మంచి ప్రోత్సాహం అన్నట్లుగా కూడా తమిళ మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వారు ఈ జంటను అభినందిస్తున్నారు. చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో రూపొందిన సమయంలో సరైన రిలీజ్‌ లేకుంటే కిల్ అవుతాయి. అందుకే ఈ సినిమాను వీళ్లు తీసుకోవడం తో సినిమా స్థాయి పెరిగింది. ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వీరు తీసుకున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.