Begin typing your search above and press return to search.

పెళ్లి కాకుండానే ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారుగా..!

By:  Tupaki Desk   |   2 Jan 2022 10:30 AM GMT
పెళ్లి కాకుండానే ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారుగా..!
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో లేడీ సూపర్ స్టార్‌ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఈ అమ్మడు నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ ఉంది. ఇక ఈమె గత కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం కూడా తెల్సిందే. వీరి పెళ్లి అదుగో ఇదుగో అంటూ రెండు మూడేళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. పెళ్లి మాట ఏమో కాని ఇద్దరు కూడా దంపతుల మాదిరిగా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో చాలా కాలంగా వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు ఆ విషయాన్ని ఖండించలేదు.. అలా అని నిజం అనడం లేదు.

పండుగా.. ప్రత్యేక సందర్బం.. పుట్టిన రోజు సందర్బం ఏదైనా కూడా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం చూస్తున్నాం. కేరళలో ఓనం పండుగ కోసం విఘ్నేష్ ను వెంట పెట్టుకుని ప్రత్యేక విమానంలో వెళ్లిన నయనతార తాజాగా కొత్త సంవత్సర వేడుకలను దుబాయిలో చేసుకుంది. విఘ్నేష్‌ శివన్ మరియు నయతార కలిసి బూర్జ్ ఖలీఫా ముందు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వీరి ఫొటోలు ఎప్పటిలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున వీరి పెళ్లి.. ప్రేమ గురించి మళ్లీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పెళ్లి కాకుండానే ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

విఘ్నేష్‌ శివన్‌ మరియు నయనతార లు కలిసి సహజీవనం సాగిస్తున్నారు అనేందుకు పలు సాక్ష్యాలు ఉన్నాయంటూ చెబుతున్న తమిళ మీడియా ఇప్పుడు దీన్ని కూడా ఒక సాక్ష్యంగా చూపుతున్నారు. ఇద్దరు ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం నయనతార హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆఫర్లు తగ్గుతాయి. అందుకే ఆమె పెళ్లికి ముందు వరకు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈమద్య ఏడాదికి రెండు మూడు అంతకు మించి కూడా కమిట్‌ అయ్యి చేస్తుంది. వచ్చే కొత్త ఏడాది వరకు అయినా వీరిద్దరు దంపతులుగా మారుతారేమో చూడాలి.