Begin typing your search above and press return to search.
సరోగసి చట్టబద్ధంగానే... ఆరేళ్ల క్రితం పెళ్లి!
By: Tupaki Desk | 16 Oct 2022 10:01 AM GMTసరోగసీపై విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ జంట నయనతార- విఘ్నేష్ శివన్ లు తమ దగ్గర బంధువును అద్దె తల్లిగా ఎంచుకున్నారు. తమిళనాడు ఆరోగ్య శాఖకు ఇచ్చిన అఫిడవిట్ లో ఈ జంట ఈ ఏడాది జూన్ లో జరిగిన అధికారికంగా పెళ్లాడినా కానీ.. తమ వివాహం ఆరేళ్ల క్రితం నమోదు చేయబడిందని స్పష్టం చేశారు. వారు అఫిడవిట్ తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను కూడా సమర్పించారు. అప్పట్లోనే ఈ జంట రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నారు.
నయనతార- విఘ్నేష్ శివన్ చట్టాన్ని ఉల్లంఘించారా? సరోగసీ చట్టం ఏం చెబుతోంది? అన్న వివరాల్లోకి వెళితే...ఈ జంట చేసినదాంట్లో ఎలాంటి తప్పిదం లేదని తేలింది. నయన్- విఘ్నేష్ జంట సరోగసీ చట్టాలను ఉల్లంఘించారో లేదో తెలుసుకోవడానికి తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ దర్యాప్తును ఆదేశించిన నేపథ్యంలో వాస్తవ వివరాలన్నీ బయటకు వచ్చాయి.
2021లో రూపొందించిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) చట్టం - సరోగసీ (నియంత్రణ) చట్టం ప్రకారం దంపతులు వివాహం చేసుకుని ఐదేళ్లయితే మాత్రమే సరోగసీకి అర్హులుగా పరిగణిస్తారు. భార్య వయస్సు 25 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. భర్త 26 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. దంపతులకు జీవసంబంధమైన లేదా దత్తత తీసుకున్న సజీవమైన బిడ్డ ఉండకూడదు.
చట్టం ప్రకారం.. అద్దె తల్లి దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలి. వివాహిత తన స్వంత బిడ్డను కలిగి ఉండాలి. 25 - 35 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీ ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగేట్ కి అంగీకరించాలి.
అక్టోబరు 9న తాము కవల మగపిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని నయన్-విఘ్నేష్ దంపతులు వెల్లడించారు. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని దంపతులు సమర్థించుకున్నారు. వారి వివరాల ప్రకారం గత డిసెంబర్ లో సరోగసీ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సర్రోగేట్ నిజానికి UAEలో ఉన్న నయనతార బంధువు. ఆమె దుబాయ్ లో తమ వ్యాపారాన్ని చూసుకుంటుంది. కవలలు జన్మించిన చెన్నైలోని ఆసుపత్రిని కూడా గుర్తించారు. నయనతార తిరువల్లలోని కొడియాట్టు కుటుంబానికి చెందినవారు. విఘ్నేష్ చెన్నై వాసి.
సినీ తారల మధ్య సరోగసీ కేసు ఇదే మొదటిది కాదు. గతంలో కరణ్ జోహార్... తుషార్ కపూర్ వంటి అవివాహిత బాలీవుడ్ ప్రముఖులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు. అయితే ఈ కేసులు సరోగసీ (నియంత్రణ) చట్టం 2021లో అమల్లోకి రాకముందు నమోదయ్యాయి.