Begin typing your search above and press return to search.
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తో నయన్
By: Tupaki Desk | 5 Feb 2018 4:36 PM GMTటాలెంట్ ఉంటే అవకాశాలు ఎక్కడైనా వస్తాయి అని నేటి యువతరం ఉదాహరణలని చాలానే చూపిస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం కంటే రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ కు కరెక్ట్ గా డైరెక్షన్ చేయగలిగితే చాలు. వెండి తెరపై అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక మరికొంత మంది యువ దర్శకులు డైరెక్ట్ గా స్టార్స్ ని కలుస్తూ కెరీర్ ను స్పీడ్ గా ట్రాక్ లోకి ఎక్కించేస్తున్నారు.
ఇటీవల అదే తరహాలో తెలుగు లో రెండు లఘు చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సర్జున్ అనే యువకుడు సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మా - లక్ష్మి అనే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని అనుకున్నాయి. అయితే రీసెంట్ గా ఒక హర్రర్ స్క్రిప్ట్ ని నయనకు వినిపించడంతో ఆమె ఏ మాత్రం సందేహించకుండా త్వరలోనే సినిమాని స్టార్ట్ చేద్దామని చెప్పేసిందట.
సౌత్ లో ప్రస్తుతం నయనతార టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశం అందుకుంటోంది. ముఖ్యంగా సైరా లో మెగాస్టార్ పక్కన నటించబోతోన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ కథకి ఒకే చెప్పేసిందటే కాన్సెప్ట్ లో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా మరికొన్ని రోజుల్లో చెన్నైలోనే సినిమాను స్టార్ చేయాలని నయన్ అనుకుంటున్నట్లు సమాచారం.