Begin typing your search above and press return to search.

ఆయన మా ఆయన.. ఇకపై అందరూ అలానే రాయండి

By:  Tupaki Desk   |   16 Aug 2021 3:04 AM GMT
ఆయన మా ఆయన.. ఇకపై అందరూ అలానే రాయండి
X
ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. అగ్రనటి నయనతార రూటు మాత్రం సపరేటు. ఎందుకంటే.. హీరోయిన్ ఆయుష్ఫు మహా అయితే మూడు నాలుగేళ్లు. కాదంటే మరో రెండేళ్లు అదనంగా వేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది పదేళ్లకు పెరుగుతుంది. కానీ.. నయనతార మాత్రం ఏకంగా రెండు దశాబ్దాలు. సరిగ్గా చెప్పాలంటే పందొమ్మిదేళ్లు. హీరోయిన్ గా ఆమె నటించిన మొదటి సినిమా 2003లో విడుదలైంది. బుడిబుడి అడుగులతో మొదలైన ఆమె ప్రయాణం.. అనూహ్యంగా ఆమె అగ్రనటిగా నిలవటమే కాదు.. ఆమె నిర్ణయాలు ఆమె స్టార్ స్టేటస్ ను పదిలంగా ఉండేలా చేశాయి.

ఇప్పటికి కొన్ని పాత్రలకు ఆమె తప్పించి.. మరే హీరోయిన్ సూట్ కాదన్న ప్రత్యేకత ఆమె సొంతం. వ్యక్తిగత విషయాలు ఎన్ని మీడియాలో వచ్చినా.. ఆమె ఇమేజ్ మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యం. అంతేనా.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా..ప్రత్యేక ఫోటో షూట్ లకు దూరంగా ఉండటం.. సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోకుండా ఉంటూ.. అగ్రనటిగా ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.

కొత్త సినిమాను సైన్ చేసే వేళలో.. అగ్రిమెంట్ మీద స్పష్టంగా తాను సినిమా ప్రమోషన్లలో పాలుపంచుకోనని రాయించిన తర్వాతే సంతకం పెట్టే హీరోయిన్ ఆమె ఒక్కతేనని చెబుతారు. అలాంటి నయనతార ఎట్టేలకు ఒక ఇంటిది కానుంది. ఆమె రీల్ లైఫ్ లో ప్రేమలే కాదు.. ఆమె రియల్ జీవితం ప్రేమ చుట్టూ చాలానే తిరిగింది. అయినప్పటికీ అన్ని పెళ్లి వరకు రావటం.. అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోవటం తెలిసిందే.

కొంతకాలంగా ఆమె విఘ్నేష్‌శివన్ తో రిలేషన్ లో ఉండటం తెలిసిందే. తాను సీక్రెట్ గా పెళ్లి చేసుకోనని.. అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పే నయనతార తాజాగా ఈ విషయం మీద పెదవి విప్పారు. చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చే నయన్.. తాజాగా ఒక చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచచారు. ఇందులో తనకు.. విఘ్నేశ్ కు ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన వారు హాజరయ్యారని చెప్పింది.

సంబరాలు చేసుకోవటం తనకు ఇష్టం ఉండదని చెప్పిన ఆమె.. అందుకే కొద్ది మంది సన్నిహితుల నడుమ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు చెప్పింది. పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదని చెబుతూ.. డేట్ డిసైడ్ అయ్యాక తన ఫ్యాన్స్  కు చెబుతానని చెప్పింది.

విఘ్నేశ్ తన బాయ్ ఫ్రెండ్ స్టేజ్ ను దాటిపోయాడని.. అతను తనకు కాబోయే భర్త అని ఆమె ప్రకటించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా మీడియాకు సైతం ఒక సూచన చేశారు. విఘ్నేశ్ ను ఇకపై మారిన రిలేషన్ కు తగ్గట్లుగా రాస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇలాంటివి నయనతారకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.