Begin typing your search above and press return to search.

నానీతో కలిసి నటించడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను: నజ్రియా

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:52 AM GMT
నానీతో కలిసి నటించడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను: నజ్రియా
X
నజ్రియా అందాన్ని .. అభినయాన్ని వర్ణించడానికి ఒక పెన్ను .. ఒక పేపరూ చాలవు. కళ్లతో ఆమె పలికించే హావభావాలను గురించి .. చూపులతో చేసే విన్యాసాలను గురించి ఒక గ్రంథమే రాయొచ్చు. కథానాయికగా ఆమె రంగంలోకి దిగి పదేళ్లు అవుతోంది. కానీ ఈ పదేళ్ల కాలంలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ .. చూపిన ప్రభావం ఎక్కువ.

తమిళ .. మలయాళ భాషల్లో ఆమెకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు .. అంతకుమించిన ఆరాధకులు ఉన్నారు. ఆమె సినిమాల కోసం థియేటర్ల దగ్గర కాచుకుని కూర్చునేవాళ్లున్నారు.

పదేళ్ల తరువాత మొట్టమొదటి సారిగా ఆమె తెలుగులో ఒక సినిమా చేసింది .. ఆ సినిమా పేరే 'అంటే .. సుందరానికీ'. పూర్తి వినోదభరిత్తమైన సినిమా ఇది. సరదాగా సందడి చేస్తూ సాగిపోయే కథ ఇది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె లీలా థామస్ అనే పాత్రలో నాని సరసన కనిపించనుంది.

ఈ సినిమాపై ఆసక్తినీ .. అంచనాలను పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు.

ఈ వేదికపై నజ్రియా అందంగా మెరిసింది. ఆమె మాట్లాడుతూ .. " ఈ రోజున నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ గురించి నేను చాలా విన్నాను నాని భార్య ద్వారా .. ఆమెది వైజాగ్ నే. సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో .. సినిమా పట్ల మీరు ఎంత ఆసక్తిని చూపుతారనేది కూడా నాకు అర్థమైంది. ఒక ఏడాదిలో నా కెరియర్ కి సంబంధించిన మూడు మంచి విషయాలు జరిగాయి. వాటిలో ఒకటి నేను ఫస్టు టైమ్ ఒక తెలుగు సినిమా చేయడం. రెండవది నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకోవడం .. మూడోది వైజాగ్ రావడం.

ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పుకోవలసిన వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లలో ముందుగా నేను మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను యాక్ట్ చేసిన వాళ్లలో నాని ఒక మంచి యాక్టర్ తన కారణంగా ఈ సినిమాకి సంబంధించి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఇచ్చిన పాత్రకి నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. జూన్ 10వ తేదీన అందరూ కూడా థియేటర్స్ లో ఈ సినిమా చూడండి. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు " అంటూ చెప్పుకొచ్చింది.