Begin typing your search above and press return to search.

ఆ ప్రపంచం నుండి నజ్రియా కొన్నాళ్లు బయటకు..!

By:  Tupaki Desk   |   13 May 2023 4:04 PM GMT
ఆ ప్రపంచం నుండి నజ్రియా కొన్నాళ్లు బయటకు..!
X
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అభిమానులతో టచ్ లో ఉండాలంటే కచ్చితంగా సోషల్ మీడియా ని ఉపయోగించుకోవాల్సిందే. సోషల్‌ మీడియా ద్వారా స్టార్స్ అయిన వారు ఉంటున్నారు... సోషల్‌ మీడియా ద్వారా ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలు కూడా ఉంటున్నారు.

కొందరు హీరోయిన్స్ ఇన్‌ స్టా లో రెగ్యులర్ గా అందాల ఆరబోత చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తమ సోషల్ మీడియా కు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నాం అంటూ చిన్న బ్రేక్‌ తీసుకుంటున్నారు. కొందరు రీ ఎంట్రీ ఇస్తే కొందరు పూర్తిగా సోషల్‌ మీడియాను వదిలేస్తున్నారు.

ఇప్పటి వరకు హీరోయిన్స్.. హీరోలు.. ఫిల్మ్‌ మేకర్స్ కూడా సోషల్‌ మీడియాకు బ్రేక్ తీసుకున్న వారు ఉన్నారు. ప్రశాంతత కోసం.. కొన్నాళ్లు గందరగోళం కు దూరంగా ఉండటానికి సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సాధారణ జనాలు కూడా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రపంచం నుండి నజ్రియా నజీమ్‌ ఫహద్‌ కూడా బయటకు వస్తున్నట్లుగా ప్రకటించింది. సోషల్‌ మీడియాకు పూర్తి దూరంగా ఉండాలని.. బ్రేక్ తీసుకుని కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నట్టు పేర్కొంది.

'DND మోడ్' లోకి వెళ్లబోతున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారానే నజ్రియా ప్రకటించింది. ఆమె గతంలో రెగ్యులర్‌ గా తన అందాల ఫోటోలను షేర్‌ చేసేది. కానీ ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనే నిర్ణయానికి రావడం చర్చనీయాంశం అయ్యింది.

నజ్రియా నజీమ్‌ మే 12 నుండి సోషల్ మీడియాకు విరామం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. నజ్రియా నిర్ణయాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేయాలని కూడా కోరుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాలకు మరియు సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటుంది.