Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత లక్ ఉందొ లేదో ?

By:  Tupaki Desk   |   6 Sep 2017 4:49 PM GMT
పెళ్లి తర్వాత లక్ ఉందొ లేదో ?
X
మళయాలం అమ్మాయిల్లో ఏం మంత్రం ఉంటుందో ఏమో గాని హీరోయిన్స్ గా సక్సెస్ ఇట్టే అందుకుంటారు. ఇక రెండు మూడు సినిమాల్లో అలా మెరిశారంటే చాలు కోలీవుడ్ - టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వారి స్టైల్ లో సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొందరు పాపలు కూడా పదహారేళ్లకే వెండి తెరపై వెలగాలని చూస్తూ ఉంటారు. అదే తరహాలో మలయాళం వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా వెలిగింది నజ్రియా నజిమ్.

ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తమిళ్ లో "రాజా రాణి" సినిమాలో హీరోని బ్రథర్ అంటూ సంబోదించి ఓ వెరైటీ పాత్రలో కనిపించింది. ఆ సినిమా నజ్రియా కి నటనాపరంగా మంచి మార్కులే తెచ్చిపిపెట్టింది. ఆ తర్వాత వరుస గా అటు తమిళ్ ఇటు మళయాలం సినిమాలతో 2014వరకు బిజీగా మారిపోయింది. అయితే మంచి సక్సెస్ఆ ట్రాక్ లో ఉండగానే అమ్మడికి మళయాలం నటుడు ఫహద్ ఫాజిల్ తో వివాహం అవ్వడంతో సినిమాలను దూరం పెట్టేసింది. దీంతో ఆమె అభిమానులు చాలా నిరాశ చెందారు. అయితే మళ్లీ ప్రేక్షకులను ఖుషి చేయడానికి ఇప్పుడు మారో సినిమాతో మలయాళం లోనే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టబోతోంది.

పృద్వి రాజ్ హీరోగా అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నజ్రియాను సెలక్ట్ చేశారట. ఆ సినిమా 2018 లో రిలీజ్ అవ్వనుందట. ఎలాగైనా ఆ సినిమాతో రాణి గారు మళ్లీ హిట్ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. నజ్రియా నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి అమ్మడి లక్ ఎలా ఉందొ తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.