Begin typing your search above and press return to search.

సుందరానికి ఆమె డబ్బింగ్‌ పూర్తి.. మొదటి సినిమాతోనే ఇంత ఎమోషన్‌ ఏంటమ్మా!

By:  Tupaki Desk   |   28 March 2022 4:30 PM GMT
సుందరానికి ఆమె డబ్బింగ్‌ పూర్తి.. మొదటి సినిమాతోనే ఇంత ఎమోషన్‌ ఏంటమ్మా!
X
నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికీ! సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమా ను జూన్ 10న విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదలకు ఇంకాస్త సమయం ఉంది. ఈలోపే చిత్ర యూనిట్‌ సభ్యులు డబ్బింగ్‌ కార్యక్రమాలు సహా పూర్తి గా అన్ని కార్యక్రమాలను ముగిస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ నజ్రియా ఫాహద్‌ తో డబ్బింగ్ ను దర్శకుడు పూర్తి చేయించాడు.

నజ్రియా మొదటి తెలుగు సినిమా ఇదే. అయినా కూడా ఆమె ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. అంటే సుందరానికీ! డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన నజ్రియా ఇన్‌ స్టా గ్రామ్‌ లో కాస్త ఎమోషనల్‌ అయ్యింది. తన ఫీలింగ్‌ ను నజ్రియా సోషల్‌ మీడియాలో షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పర్చింది.

మొదటి సినిమా తోనే... ఒక్క సినిమా తోనే ఇంత కనెక్షన్‌ ఏంటీ అంటూ నజ్రియా పోస్ట్‌ కు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు నజ్రియా ఇన్ స్టా లో ఏం షేర్‌ చేసిందంటే... దర్శకుడు వివేక్ తో ఉన్న ఫోటోను షేర్‌ చేయడం తో పాటు... నేడు నేను అంటే సుందరానికీ! సినిమా డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ సినిమాను ఒక అద్బుతమైన వ్యక్తి తెరకెక్కించాడు. అతడు ఇప్పుడు నాకు మంచి స్నేహితుడు కూడా అంటూ నజ్రియా చెప్పుకొచ్చింది.

నజ్రియా ఇంకా... తెలుగు లో నా మొదటి సినిమా జర్నీ అద్బుతంగా సాగడంలో ఈయన పాత్ర అద్బుతం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. నీతో వర్క్ చేయడంను ప్రేమించాను. గత సంవత్సర కాలంగా మీతో జర్నీ మరువలేనిది. మళ్లీ మళ్లీ మీతో వర్క్‌ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

మొదటి సినిమాతోనే చిత్ర యూనిట్‌ సభ్యులకు ముఖ్యంగా దర్శకుడు వివేక్ ఆత్రేయతో నజ్రియా స్నేహం ఈ స్థాయిలో ఏర్పడటం ఆశ్చర్యం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమెను ఇప్పటికే డబ్బింగ్‌ సినిమాల్లో చూసిన తెలుగు ప్రేక్షకులు నానితో మొదటి తెలుగు సినిమాలో చూడబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉన్నాం అంటున్నారు. ఈ సినిమా నజ్రియాకు చాలా ఎమోషనల్‌ బాండింగ్స్ ను క్రియేట్‌ చేసిందని ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది.