Begin typing your search above and press return to search.
మా ఆయన బాగానే ఉన్నాడుః నటి
By: Tupaki Desk | 9 March 2021 8:44 AM GMTఇటీవల సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ‘మలయన్ కుంజు’ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా.. ఓ ఇంటి సెట్ ను నిర్మించారు. ఇందులో సీన్ ఏమంటే.. కూలిపోతున్న ఆ ఇంట్లో నుంచి ఫాజిల్ తప్పించుకోవాలి. ఈ సీన్ షూట్ చేస్తుండగా.. సకాలంలో బయటపడలేకపోయారు ఫహద్. ఇంటి నుంచి బయటకు దూకే సమయంలో పట్టుతప్పి, అందులోనే పడిపోయారు.
ఈ ప్రమాదంలో ఫాజిల్ ముక్కుకు పెద్ద గాయమైందని సమాచారం. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు.. ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. గాయం పెద్దదే అయినప్పటికీ.. ఫాజిల్ కు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారట. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఫాజిల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే.. తాజాగా ఆయన భార్య, నటి నజ్రియా.. ఫహద్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పింది నజ్రియా. కాగా.. నజ్రియా-ఫహద్ 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి నజ్రియా సినిమాలకు దూరమైంది.