Begin typing your search above and press return to search.

NBK 107: వీరసింహారెడ్డి.. అదే స్టోరీ లైన్!

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:37 AM GMT
NBK 107: వీరసింహారెడ్డి.. అదే స్టోరీ లైన్!
X
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే సినిమా తో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. కేవలం ఫస్ట్ లుక్ టీజర్ తోనే దర్శకుడు గోపీచంద్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాడు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. మొత్తానికి ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే భారీ స్థాయిలో వచ్చే అవకాశం అయితే ఉంది.

అయితే దర్శకుడు మొదట ఈ సినిమా కథను కొన్ని నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా రెడీ చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకోసం అనంతపురం రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్ సంఘటనలపై రీసెర్చ్ కూడా చేయడం జరిగిందట. అప్పట్లో దర్శకుడు కథ కోసం రాయలసీమలోని కొన్ని పాత లైబ్రరీలను కూడా సందర్శించాడు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమాలోని మేయిన్ కథ ఎప్పటిలానే బాలయ్య మార్క్ కు తగ్గట్టుగా రొటీన్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాల్లో కూడా నందమూరి బాలకృష్ణ రెండు పాత్రలు కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఫస్ట్ హాఫ్ లో మొత్తం యంగ్ క్యారెక్టర్ లో బాలయ్య బాబు కనిపించబోతున్నడట. ఇక హీరోయిన్ తో ఉండే లవ్ స్టోరీ సన్నివేశాలు హైలెట్ అవుతాయట.

ఆ తర్వాత ఒక ప్రమాదంతో కొడుకు గాయపడటంతో భార్య పిలుపుమేరకు సీనియర్ బాలకృష్ణ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు అని తెలుస్తోంది. ఎంట్రీ తోనే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఆదర్శకుడు హై వోల్టేజ్ సన్నివేశాలను తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం.

ఇక విదేశాల నుంచి కథ మళ్ళీ ఒక్కసారిగా ఇండియాకు షిఫ్ట్ అవుతుందట. ఊహించిన విధంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా ఉంటాయని తెలుస్తోంది.

దాదాపు ఇది లెజెండ్ లైజ్ లేనే ఉండబోతోందట. అలాగే సింహ కథ కూడా దాదాపు ఇదే లైన్లో కొనసాగుతుంది. ఇక రీసెంట్ గా అఖండ లో కూడా డబుల్ యాక్షన్ లో ఒక బాలయ్య బాబు ఆపదలో ఉంటే మరొక బాలయ్య బాబు ఆఘోర పాత్రలో ఎంట్రీ ఇవ్వడం రొటీన్ లైన్ అయినప్పటికీ కూడా మేకింగ్ విధానంలో బోయపాటి కొత్తగా ప్రజెంట్ చేశాడు. మరి ఇప్పుడు గోపీచంద్ మలినేని ఎలాంటి స్టైల్ తో బాలయ్యను హైలెట్ చేస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.