Begin typing your search above and press return to search.

NBK 108: ఓ క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ  

By:  Tupaki Desk   |   3 Dec 2022 12:02 PM IST
NBK 108: ఓ క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ  
X
నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమా వీర సింహారెడ్డి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. అయితే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇదివరకే మొదలయ్యాయి.

ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో దాదాపు అందరూ సెట్ అయ్యారు. కానీ మేయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. వివిధ రకాల పేర్లు కూడా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా త్రిషను అనుకున్నారని అలాగే నయనతారను కూడా అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల నటించబోతోంది.

అయితే నయనతారను సంప్రదించినప్పటికీ కూడా హీరోయిన్ కు తల్లిగా కనిపించేందుకు ఒప్పుకోలేదని ఒకవేళ అలా చేయాల్సి వస్తే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేసినట్లు మరికొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఆ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక మరో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను కూడా ఓకే చేసినట్లు టాక్ వచ్చింది.

ఇక మొత్తానికి ఆ విషయంలో సోనాక్షి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను ఒక తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయని ఆ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను ఆమె సోషల్ మీడియాలో ఒక వివరణ అయితే ఇచ్చింది.

నేను పలనా చిత్రంలో సెలెక్ట్ అయ్యాను అని ఆ తర్వాత మళ్లీ తప్పుకున్నాను అని ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఆర్టికల్స్ రాసిస్తున్నారు అని ఆ విషయంలో ఎలాంటి నిజం లేదు అని ఈ బ్యూటీ సరదాగా చెప్పుకొచ్చింది. మొత్తానికి సోనాక్షి సిన్హాను అయితే ఎవరూ కూడా సంప్రదించలేదు అని ఈ విషయంతో క్లారిటీగా అర్థమయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.