Begin typing your search above and press return to search.
దండేలి అరణ్యంలో NBK రాఫ్టింగ్ అడ్వెంచర్
By: Tupaki Desk | 7 Jun 2021 8:30 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ తదుపరి షెడ్యూల్ కి రెడీ కావాల్సి ఉండగా.. ఇప్పటికే ముగించిన ఫారెస్ట్ ఎపిసోడ్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అఖండ కోసం కర్నాటక దండేలి అరణ్యాలకు వెళ్లిన బాలయ్య అండ్ టీమ్ అక్కడ ఎన్నో సాహసాలు చేశారని తెలిసింది. నాయిక ప్రగ్యతో కలిసి బాలయ్య డీప్ ఫారెస్ట్ లో బోలెడన్ని విన్యాసాలు చేశారట. పారే నదిలో స్నానం .. రివర్ రాఫ్టింగ్.. ట్రెక్కింగ్ వంటివి జంగిల్ లో ఎంతో థ్రిల్ కి గురి చేస్తాయని తెలిసింది.
జంగిల్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక జంగిల్ సఫారీ అనేది ప్రత్యేక విద్య. ఇది ఎంతో ఎగ్జయిట్ చేస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ లో జరిగిన షెడ్యూల్ లో స్టంట్ శివ సారథ్యంలో షూటింగ్ సాగింది. ఇందుకోసం నటీనటులు చిత్రబృందం చాలానే రిస్కులు చేసారట. అడవిలో క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని కూడా తెలిసింది. ఇక రాఫ్టింగ్ అడ్వెంచర్ మరో హైలైట్. రాఫ్టింగ్ అంటే పారే నీటిలో పడవ మునగకుండా బ్యాలెన్స్ చేస్తూ నడిపే విన్యాసం. ఇది హిమానీ నది బియాస్ లో విస్త్రతంగా ప్రాచుర్యం పొందింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రగ్య జైశ్వాల్ కథానాయికగా నటిస్తోంది.